కడప ఈ పేరు ఇపుడు మారుమోగుతోంది. ఎందుకంటే కాబోయే సీఎం ఇక్కడ నుంచే వస్తాడని బలంగా నమ్ముతున్నారు. పులువెందుల నుంచి గెలిచి జగన్ ఏపీలో కొత్త ముఖ్యమంత్రి అవుతారని అందరి ఆకాంక్ష. దాంతో కడపకు జనం పోటెత్తుతున్నారు. కడపకు మరో విశేషం ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో  పదికి తొమ్మిది సీట్లు గెలుచుకున్న వైసీపీ ఈసారి పదికి పది గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు.


దానికి తోడు పులివెందులలో జగన్ మెజారిటీ ఈసారి రికార్డ్ స్థాయిలో రావడం ఖాయమని కూడా అంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కుప్పంలో బాబు, హిందుపురంలో బాలయ్య, మంగళగిరిలో లోకేష్ మెజారిటీలు కలిపినా జగన్ కంటే తక్కువేనని సోషల్ మీడియా పోస్టులు ఓ వైపు హోరెత్తుతున్నాయి. దాంతో అందరి చూపు కడప, పులివెందుల మీద పడింది.


ఇక ఎపీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావిస్తున్నారు. దాంతో సీఎం కేరాఫ్ కడప అన్న మాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. కడప గడపలో వైసీపీ ప్రభజనం చూసేందుకు జనం వెల్లువలా తరలివస్తున్నారు. అదే విధంగా బెట్టింగ్ రాయుళ్ళు కూడా కడప హొటళ్ళలో మకాం వేసి మరీ సై అంటున్నారు. పందేలతో కడపలో సందడి చేస్తున్నారు. 


కడపలో ఉన్న లాడ్జిలు, హొటళ్ళు  చాలా రోజుల నుంచే బుక్ అయిపోయాయి. ఎవరిని అడిగినా ఖాళీ లేదు అన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట ఫలితాలపైన జనంలోనూ, పందెం రాయుళ్ళలోనూ తెగ ఆసక్తి ఉంది. దాంతో పందేలు కూడా కోట్లలో ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కడప గడప ఇపుడు ఫుల్ రష్ గా ఉంది. హౌజ్ ఫుల్ గా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: