ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో ఫ‌లితాల‌పై కొంద‌రు ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ 300కి పైగా స్థానాల్లో గెలుస్తుందని అంచనాలు రావడంతో విపక్ష నేతలు కాసింత ఆచితూచి స్పందిస్తుండ‌గా...ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల నాయ‌కులు మాత్రం త‌మ కూట‌మిదే అధికారం అంటూ భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్, దాని సారథ్యంలోని యూపీఏతోపాటు ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ లేదా తృతీయ ఫ్రంట్‌తో కలిసి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి చెప్పడానికి ముందు తమకు మద్దతునిచ్చే పార్టీల నుంచి లేఖలు సమీకరించాలని చూస్తున్నాయి. 


అయితే, ఎగ్జిట్‌పోల్స్ ఇలా ఎన్డీఏ స‌త్తా ఖాయ‌మ‌ని ప్ర‌చారం చేస్తుండ‌గా మ‌రోవైపు ఆయా ప్ర‌ధాన పార్టీల్లోఈ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి రావ‌డంపై ప్ర‌ధానంగా సోనియాగాంధీ కుటుంబంలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. ఒకవేళ ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని కాంగ్రెస్ నేతలకు కొంతమందికి భయం పట్టుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ‌పై రాజ‌కీయ సంబంధ‌మైన దాడులు జరగొచ్చనే భయంతో కొంద‌రు విదేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం.


ఇప్ప‌టికే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బావ రాబార్డ్ వాద్రా విదేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఎన్నికల ఫలితాల వేళ దేశం నుంచి బయటకు వెళ్తానని సోనియా అల్లుడు అర్జీ పెట్టుకున్న‌ట్లు ఢిల్లీ రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే, ఇటీవ‌ల జ‌రిగిన ఈడీ, సీబీఐ దాడుల‌కు కొన‌సాగింపుగా మ‌రోమారు రాజ‌కీయ దాడులు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే ఉద్దేశంతో వాద్రా విదేశాల‌కు చెక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: