తెలంగాణ ఉద్యమ నేతగా పేరు గాంచి..తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా నియమితులైన కేసీఆర్ రాజకీయ నేతగానే కాదు..మంచి భర్త, తండ్రి, తాతగా తన పాత్ర పోషిస్తున్నారు.  రాజకీయంగా ఎంత ఒత్తిడి ఉన్నా..తన కుటుంబం పట్ల కొంత సమయాన్ని వెచ్చిస్తుంటారు.  అంతే కాదు తనకు దగ్గరైన వారికి సంబంధించిన ఏవైనా శుభకార్యాలకు  వెళ్లి వారిపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటారని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. 

తాజాగా కేసీఆర్ దగ్గర వంట పని చేసే వ్యక్తి వివాహానికి కేసీఆర్ హాజరయ్యారు.  ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్నో బిజీ షెడ్యూల్ లో ఉండే కేసీఆర్ తన దగ్గర వంట మనిషి ఇంటికి వెళ్లడం అక్కడ వారిని ఎంతో ఆనందింప జేసింది. తాజాగా ఈ విషయాన్ని  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 

‘పెళ్ళికొడుకు ఏ రామోజీ మనవడో, అంబానీ తమ్ముడో కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వంటపని చేస్తాడు. అతని వివాహానికి హాజరై ఇలా ఆత్మీయ ఆలింగనంతో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని ఆ ట్వీట్ లో ప్రశంసించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: