ఏపీలో జగన్ గెలవబోతున్నారన్నది అన్ని సర్వేలు చెప్పిన సత్యం. మరో ఇరవై నాలుగు గంటల్లో అది ఎలాగూ నిజం అవుతుంది. సరే కానీ జగన్ గెలవడానికి కారణం ఎవరు. ప్రజలు, విశేషమైన ఆదరణ, అసంఖ్యాకమైన కార్యకర్తల కష్టం, నాయకుల పనితీరు,  పార్టీ విధానాలు ఇవన్నీ కాదా. ఇవేమీ లేకుండా జగన్ గెలుస్తున్నాడా...


అంటే ఇవన్నీ ఉన్నా కూడా చంద్రబాబు దగ్గరుండి మరీ జగన్ని గెలిపిస్తున్నారని బీజేపీ విశాఖ నాయకుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. జగన్ బీజేపీ ఒక్కటీ అంటూ బాబు ఒకటే పనిగా వూదరగొట్టారని, దాని ఫలితంగా జగన్ మంచి మెజారిటీతో గెలుస్తున్నారని ఆయన కొత్త పాయింట్ చెప్పారు. దేశమంతా మోడీ వేవ్ బలంగా ఉందని, అటువంటి మోడీతో జగన్ని కలిపి బాబు ప్రచారం చేయడం వల్లనే ఈనాడు ఏపీలో  వైసీపీ గెలుస్తోందని ఆయన లాజిక్ చెప్పారు.


మరి ఇదే మాట మరోలా ఇంకో బీజేపీ నేత కూడా అన్నారు. ఆయన బీజేపే జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు. ఆయన కూడా ఏపీలో బాబు అపసవ్య విధానాలే జగన్ని గెలిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. బాబు పాలన వ్యతిరేకత మొత్తం జగన్ క్యాష్ చేసుకున్నాడని కూడా అయన చెప్ప్పారు. మొత్తానికి పాత మిత్రుడు చేసిన తప్పులను కమలనాధులు గుర్తు చేయడం వరకూ ఒకే కానీ జగన్ని బాబు దగ్గరుండి గెలిపించినట్లుగా మాట్లాడ‌డం మాత్రం కొంత లాజిక్కుకు అందకుండానే ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: