ఏంటో ఈ మధ్య చంద్రబాబుకు అన్నీ చేదువార్తలే వినిపిస్తున్నాయి. మచ్చుకు ఒక్కటైనా ఊరట ఇచ్చే వార్తలు కనిపించడం లేదు. పాపం.. ఓ వైపు ఆయన ఈవీఎంలపై పోరాడుతుంటే.. మరో వైపు కోర్టులు ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నట్టు కనిపించడంలేదు. 


చంద్రబాబు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కేయాలని కొన్ని రోజులుగా గట్టిగా పోరాటం చేస్తున్నారు. కానీ ఎవరూ దాన్ని ఆలకించడం లేదు. చివరకు కోర్టులు కూడా లైట్ గా నే తీసుకుటున్నాయి. తాజాగా సుప్రం కోర్టు చేసిన వ్యాఖ్యలైతే పాపం.. బాబు గారిని బాగా హర్ట్ చేసేలా ఉన్నాయి. 

మొత్తం వివిపాట్ స్లిప్ లు లెక్కించాలంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ ను సుప్రింకోర్టులో మరోసారి కొట్టేసింది. అంతే కాదు.. ఇదో నాన్సెన్స్ పిటిషన్ అంటూ అక్షింతలు వేసింది. సాంకేతిక నిపుణుల పేరుతో వేసిన పిటిషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఎందుకు ఈ న్యూసెన్స్, నాన్సెన్స్ పిటిషన్ వేస్తున్నారని కోర్టు ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. వివిపాట్ ప్లిప్ లను నియోజకవర్గానికి ఐదు చొప్పున లెక్కించాలని సుప్రింకోర్టు గతంలో సూచించింది. అయినా కొందరు ఇలా పిటిషన్ వేయడమేంటని ప్రశ్నించింది. దీని ద్వారా అందరి సమయం వృధా అవుతుందని తలంటింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: