లగడపాటి రాజగోపాల్.. మాజీ రాజకీయ నాయకుడు.. సర్వేలు చేయడం తన హాబీ అని చెప్పుకునే లగడపాటి.. దాన్నో ఆదాయ వనరుగా మార్చుకున్నాడా.. బెట్టింగ్ మాఫియాకు పరోక్షంగా సహాయం అందిస్తూ కోట్లు కూడబెట్టాడా.. తన స్వార్థంతో వందల మంది జీవితాలతో ఆటలు ఆడాడా.. 


ఇప్పుడు ఈ అనుమానాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే.. మొన్న తెలంగాణలో ఆయన సర్వే అట్టర్ ఫ్లాప్ అయ్యింది..ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మెజారిటీ సర్వేలు వైసీపీ గెలుస్తుందంటే.. ఈయన మాత్రం బాబే మళ్లీ వస్తాడని అంటున్నారు. 

దీంతో లగడపాటి తీరుపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. లగడపాటి సర్వేతో గతంలో చాలామంది వీధిన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని అయ్యన్న తెలిపారు.

ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని అయ్యన్న ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్‌ ఆధారంగా ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు పందేలు కాశారు. వాళ్లంతా సర్వనాశనమైపోయారని అయ్యన్నపాత్రుడు అన్నారు. మరి ఈ బెట్టింగ్ మాఫియాలో ఉన్నవాళ్లు బయటకు వచ్చి నిజాలు చెబితే లగడపాటికి కొత్త చిక్కులు తప్పవు. 



మరింత సమాచారం తెలుసుకోండి: