చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని సహచరుల్లో గెలిచేదెవరు ? ఓడేదెవరు ? అనే విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జోరందుకుంటోంది. గతంలో ఏ మంత్రివర్గంపైనా లేనన్ని అవినీతి ఆరోపణలు ప్రస్తుత మంత్రివర్గంపై ఉంది. మంత్రుల్లో వాళ్ళు వీళ్ళని లేదు. పేర్లు చెప్పటం కష్టం కానీ ఎవరికి దొరికిన మేర వాళ్ళు పూర్తిగా కోట్ల రూపాయలను దోచేసుకున్నారు.

 

చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక అన్నది మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు నేతలకు కల్పతరువుగా తయారైంది. పేరుకు డ్వాక్రా మహిళను ఆర్ధికంగా బలోపేతం చేయటమన్నారు. కానీ క్షేత్రస్ధాయిలో జరిగింది మాత్రం తమ్ముళ్ళకు ఆదాయ వనరుగా మార్చటమే. దాంతో తమ్మళ్ళ అక్రమ, అడ్డుగోల సంపాదనకు ఆకాశమే హద్దుగా మారిపోయింది. ఈ సంపాదనా మార్గాల వల్లే చాలామంది మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు అత్యంత అవినీతిపరులుగా జనాల్లో ముద్ర వేయించుకున్నారు.

 

దాని ఫలితమే మొన్నటి పోలింగ్ రోజున కనబడిందన్నది ఓ అంచనా. గట్టిగా చెప్పాలంటే అవినీతి ముద్రలేని మంత్రి, ఎంఎల్ఏలు, ఎంపిలు లేరంటే అతిశయోక్తి కాదు. ఇసుక అక్రమ సంపాదనలో నారావారి పుత్రరత్నం నారా లోకేష్ కు కూడా భారీ ఎత్తున వాటాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. మందలగిరిలో లోకేష్ గెలుపు కూడా అనుమానమే అంటున్నారు లేండి.

 

ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో మంత్రులందరూ పోటీ చేశారు. గెలుపోటముల పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా ఆరా అనే సంస్ధ మంత్రులపై సర్వే జరిపింది. ఆ సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటంటే అందరు మంత్రులు ఓటమిబాటలోనే ఉన్నారట. మంత్రుల అవినీతి రెండేళ్ళ నుండి బాగా ఎక్కువైపోయిందని సమాచారం.

 

ఎలాగూ మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ లేదని వాళ్ళకు తెలిసిపోయిందట. అందుకే అందినకాడికి ఫుల్లుగా దోచేసుకున్నారని సమాచారం. పాదయాత్ర సందర్భంగా జనాలు జగన్ కు బ్రహ్మరథం పట్టటం చూసిన తర్వాత తమ భవిష్యత్ చాలామందికి అర్ధమైపోయిందట. అందుకనే సంపాదనపైనే పూర్తి దృష్టి పెట్టారనే ఆరోపణలున్నాయి.  ఎవరైనా ఒకరిద్దరు గెలిచినా వారి వ్యక్తిగత సామర్ధ్యంతోనే గెలుస్తారట. అందుకే మంత్రుల్లో అత్యధికులు ఓడిపోతున్నారనే ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: