ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది.  భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ – ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ ఉదయం 5.30కి పి‌ఎస్‌ఎల్‌విసి46 రాకెట్ ద్వారా రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి… కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా రీశాట్‌-2 బీఆర్‌1 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం కాలపరిమితి ఐదేళ్లు. 


ఇస్రో పీఎస్‌ఎల్‌వీని ఉపయోగించడం ఇది 48వ సారి కాగా.. బూస్టర్లు లేకుండా పీఎస్‌ఎల్‌వీ కోర్‌ అలోన్‌ తరహా రాకెట్‌ను వినియోగించడం 14వసారి. ఇక 615 కేజీల బరువున్న రీశాట్-2బీ… అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి. ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి.


ఈ ఉపగ్రహం ఫలితాలు..ఇందులో ఏర్పాటు చేసిన ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులపై అనుక్షణం కన్నేస్తూ ఉగ్రవాద శిబిరాలు, వాది కదలికలను పసిగట్టి ఫొటోలు పంపిస్తుంది.అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తులో ఈ ఉపగ్రహం సాయపడనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలతో ఇది 48వ ప్రయోగం. 


అయితే దీనిలో ఇంకో విశేషం ఏమిటంటే…..ఇది మేఘాలు ఉన్నా అన్ని వేళలా స్పష్టమైన ఫొటోలు తీసిపంపగలదు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.ఇక భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్‌-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: