Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 2:32 pm IST

Menu &Sections

Search

కేసీఆర్ సాబ్ ఎక్క‌డ‌...ఫ్రంట్ సంగ‌తేంది?...మీడియా ముందుకు రానిది అందుకేనా?

కేసీఆర్ సాబ్ ఎక్క‌డ‌...ఫ్రంట్ సంగ‌తేంది?...మీడియా ముందుకు రానిది అందుకేనా?
కేసీఆర్ సాబ్ ఎక్క‌డ‌...ఫ్రంట్ సంగ‌తేంది?...మీడియా ముందుకు రానిది అందుకేనా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏడు విడ‌త‌ల్లో హోరాహోరీగా సాగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓటర్ల తీర్పు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో నిక్షిప్తమైంది. ఇక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఓటర్ల మనోగతంపై నిర్వహించిన సర్వే ఫలితాలను ఆదివారం సాయంత్రం విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది, ప్రధానిగా నరేంద్రమోదీ మళ్లీ అధికారాన్ని చేపడుతారని పరోక్షంగా పేర్కొన్నాయి. దాదాపు 15 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించగా, మూడు మినహా అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని అంచనా వేశాయి. మూడు సంస్థలు మాత్రమే హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నాయి.

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు, ఎగ్జిట్ పోల్స్‌, కౌంటింగ్ ప్ర‌క్రియ సంద‌డి కొన‌సాగుతుంటే..తెలుగు రాష్ట్రాల‌కు చెందిన అన్ని ప్ర‌ధాన పార్టీల నేత‌లు త‌మ త‌మ వాణి వినిపిస్తుంటే....ఈ సంద‌డితో త‌మ‌కేమాత్రం సంబంధం లేన‌ట్లుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెలువ‌డింది మొద‌లు ఢిల్లీ రాజ‌కీయం వేడెక్కింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో భేటీల హడావుడి మరింత ముమ్మరమైంది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో యూపీ కీలక నేతలు అఖిలేశ్‌యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) భేటీ అయ్యారు. మరోవైపు ఫలితాల్లో హంగ్‌వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి వచ్చే అవకాశాలపై ఢిల్లీలో విపక్షాలు నేడు మేధోమథనం నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం, మంగ‌ళ‌వారం ప‌లువురు నేత‌ల‌తో సమావేశమయ్యారు.  ఆదివారం ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌పవార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్ట్ పార్టీల నేతలతోనూ, లక్నోలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు సమావేశమై మహా కూటమి భావి వ్యూహంపై సవివరంగా చర్చించిన సంగతి తెలిసిందే. అధికార బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ ప్రధానకార్యదర్శి భయ్యాజీ జోషితో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ సోమవారం భేటీ అవగా.. ప్రధాని మోదీ సైతం త్వరలో నాగపూర్‌కు వెళ్లి.. ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్‌భగవత్‌తో సమావేశంకానున్నారు.


ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ 300కి పైగా స్థానాల్లో గెలుస్తుందని అంచనాలు రావడంతో బీజేపీ నేత‌లు ఖుషీలో ఉండ‌గా....ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టి పారేసిన విపక్ష నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాదన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై సమయం వృథా చేయరాదని భావిస్తున్నారు. కాంగ్రెస్, దాని సారథ్యంలోని యూపీఏతోపాటు ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ లేదా తృతీయ ఫ్రంట్‌తో కలిసి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి చెప్పడానికి ముందు తమకు మద్దతునిచ్చే పార్టీల నుంచి లేఖలు సమీకరించాలన్న వ్యూహంతో విపక్ష నాయకులు ముందుకు సాగుతున్నారు.


ఇలా దేశ‌వ్యాప్తంగా ముఖ్య‌నేత‌లంతా బిజీబిజీగా గ‌డుపుతుండ‌గా....తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్ మాత్రం త‌న‌దైన శైలిలో మౌన‌ముద్ర దాల్చుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో దేశంలో స‌త్తా చాటుకునేందుకు ప్రాంతీయ పార్టీల‌న్నీ క‌లిసి రావాల‌ని వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించలేదు. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి కూట‌మి గురించి సైతం మాట మాత్ర‌మైన స్పంద‌న లేదు. ఇక ఎన్డీఏకు వ్య‌తిరేకంగా సాగుతున్న ఆయా ప్రాంతీయ పార్టీల‌తోనూ కేసీఆర్ చ‌ర్చించిన‌టువంటి దాఖ‌లాలు మ‌చ్చుకైనా లేవు. గులాబీ ద‌ళ‌ప‌తి మౌనం వెనుక మ‌ర్మం ఏంటి? ఢిల్లీ ప‌రిణామాల‌పై ఆయ‌న ఎప్పుడు స్పందిస్తారు? ఈ చ‌ర్చ‌ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తోంది. 


kcr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమెరికా పెద్దాయ‌న‌తో కీల‌క చ‌ర్చ‌...హెచ్‌1బీ త‌ల‌నొప్పులకు చెక్‌
బంగారం కంటే..నీళ్ల ధ‌రే ఎక్కువ‌...మ‌న‌ద‌గ్గ‌రే ఈ వింత
చిరు పొలిటిక‌ల్ రీ ఎంట్రీ..అడ్డుప‌డుతుంది వారే
ముహుర్తం రెడీ... కేసీఆర్ రికార్డు..రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌...
బాబోరి గొప్పలు ... ఆంధ్రా కి అప్పుల తిప్పలు ...
హైద‌రాబాద్‌లో స్వ‌రూపానందేంద్ర‌...ఆ కార్య‌క్ర‌మంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌
చంద్ర‌బాబు ఈగో హ‌ర్ట‌య్యేలా చేసిన బొత్స‌
మ‌ళ్లీ బుక్క‌యిన లోకేష్‌...ఈసారి విజ‌య‌సాయిరెడ్డి చేతిలో...
కేఏపాల్ బ‌యోపిక్‌..హీరో ఎవ‌రంటే...
ప్ర‌జా వేదిక కూల్చివేత‌లోకి బీజేపీ ఎంట్రీ...హైకోర్టు కీల‌క నిర్ణ‌యం...
తెలుగు ఎన్నారై కుటుంబంలో విషాదం..అక‌స్మాత్తుగా గుండెపోటుతో..
ఉండ‌వ‌ల్లి ప్ర‌జావేదిక ఇక చ‌రిత్రే..కూల్చివేత‌లో ఏం జ‌రిగిందంటే...
క‌చోరీలు అమ్మే వ్య‌క్తిపై జీఎస్టీ దాడులు...షాక్‌కు లోనైన ఐటీ అధికారులు
జ‌ర్న‌లిస్టుకు ముఖ్య ప‌ద‌వి...జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
అంటే...లోకేష్‌కు సీఎం జ‌గ‌న్ దొరికిపోయిన‌ట్లేనా?
అమెరికాలో ఘోర ప్ర‌మాదం...హైద‌రాబాదీ దుర్మ‌ర‌ణం
జంపింగుల వెనుక బాల‌య్య‌...టీడీపీలో కొత్త క‌ల‌క‌లం
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
సుజ‌నా, ర‌మేష్ కోసం అమిత్‌షా ఎంట్రీ...ఇక ఇబ్బందేం లేద‌న్న‌ట్లే
108 వ‌చ్చేవ‌ర‌కు ఎందుకు..నా వాహ‌నం ఉందిగా...మంత్రి అనీల్ కుమార్ ఔదార్యం!
జ‌గ‌న్ తొలి క‌లెక్ట‌ర్ల‌ స‌మావేశం...సంచ‌ల‌న ఎజెండా ఇదే...బాబు బ్యాచ్ అవాక్కే
కాంగ్రెస్ జెండా పీకేస్తుంది..తెలంగాణ‌లో అధికారం ఎవ‌రిదంటే..
రైతుల కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం...టీడీపీ నేత‌ల‌కు షాకిచ్చిన జ‌గ‌న్‌
మంత్రి మ‌ల్లారెడ్డి...మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్‌
బిగ్ బాస్ కౌశ‌ల్ సంచ‌ల‌నం...మాన‌వ మృగంపై పోరాటానికి రెడీ
కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం...రాష్ట్ర ర‌థ‌సార‌థిగా ఆయ‌నే
బీజేపీలోకి టీడీపీ ఎంపీలు...ఆవేద‌న‌లో వెంక‌య్య‌
బ్రేకింగ్ఃక‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క మార్పులు...సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
జ‌గ‌న్‌...నీ మంత్రుల చిట్టా ఉంది...టీడీపీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్ మోడ‌ల్ రెడీ...ఆ రెండే అస‌లు స‌మ‌స్య‌లు
సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం...అమ్మ ఒడిపై కీల‌క నిర్ణ‌యం....
బీజేపీలోకి మ‌రో ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు...ఎందుకు వారికి కండువా అంటే
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
కొత్త‌గా వ్యాపారం పెడుతున్నారా...ఇదిగో గుడ్ న్యూస్‌
సుజ‌నాకు బీజేపీ మొద‌టి షాక్‌..అనుకున్న‌ది ఒక‌టి...అయింది మ‌రొక‌టి
డీల్ ఓకే...కోమ‌టిరెడ్డి జంప‌య్యే తేదీ ఇదే...అమిత్‌షాతోనే అస‌లు స‌మ‌స్య‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.