మోడీ మరోసారి ప్రధాని అవుతారంటూ, కేంద్రంలో మళ్లీ ఎన్డీయేకే అధికారం తప్పదని, పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్లో నిజం లేదని, ప్రతిపక్షాలు అంటున్నాయి. తమ ఐక్యతను దెబ్బతీసే కుట్రలో భాగంగానే, ఈ సారి సర్వే సంస్థలు పూర్తిగా దారి తప్పాయని, వాదిస్తున్నాయి.ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌ , మధ్యప్రదేశ్‌ లో ఆరునెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందని, అక్కడ కూడా ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారంటేనే ఎగ్జిట్‌ పోల్స్‌లో నిజం ఏమిటో అర్థమవుతుందంటున్నారు.

 విదేశాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ రివర్స్‌ అయ్యాయి

అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో ( 2016లో ) ఎగ్జిట్‌ పోల్స్‌ తారుమారయ్యాయి. హిల్లరీ క్లింటన్‌ ప్రెసిడెంట్‌, అవుతారని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి కానీ.. అసలు ఫలితాలు వచ్చేసరికి రిపబ్లికన్‌ పార్టీనాయుకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఇక, ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష లేబర్‌ పార్టీ విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినప్పటికీ, అధికార లిబరల్‌ పార్టీ విజయం సాధించింది.

 వాస్తవాన్ని పట్టుకోలేని సంస్థలు!

 మన దేశంలో చాలా మంది ఓటర్లు తాము ఎవరికి ఓటేశామన్నది చెప్పడానికి ఇష్టపడరని, ఓటరు నాడిని పట్టుకోవడంలో చాలా సంస్ధలు విఫలం అవుతున్నాయని, ప్రతిపక్షాలన్నీ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్కటైన ప్రస్తుత సమయంలో ఏకపక్షంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రావడం నమ్మలేకపోతున్నామని, చాలామంది రాజకీయ విశ్లేషకులంటున్నారు.

 నోట్లరద్దుతో,జీఎస్‌టీతో బాధలు పడి, ఏటిఎంల దగ్గర క్యూలు కట్టిన జనం బీజేపీ సర్కారు పెట్టిన కష్టాలను మర్చిపోరని,తగిన గుణపాఠం చెబుతారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ తీవ్రంగా వస్తున్నాయి. ఐదేళ్ల ఎన్డీయే ప్రభుత్వంపై చాలా వర్గాల్లో వ్యతిరేకత కనిపించిందని, అది సైలెంట్‌ ఓటుగా పడిందని ప్రతిపక్షాలతో పాటు మేధావి వర్గం ,సీనియర్‌ పాత్రికేయులు బలంగా నమ్ముతున్నాయి. 

టీఎంసీ చీఫ్‌ మమత ఫైర్‌ 
ఈవీఎంలను తారుమారుచేసే కుట్రలో భాగంగానే ఎగ్జిట్‌ పోల్స్‌ ను ఎన్డీయేకు అనుకూలంగా ఇచ్చారని టీఎంసీ చీఫ్‌ మమతబెనర్జీ బాంబు పేల్చారు.
మమత చెప్పిన దాంట్లో పాయింట్‌ ఉందని అన్ని ప్రతిపక్షాలు గొంతు ఎత్తుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఇపుడు కొత్తగా మొదలు కాలేదని, అయితే సంస్దల విశ్వసనీయత మీద వాటి ఫలితాలు ఆధారపడి ఉంటాయని, మన దేశంలో ఎగ్జిట్‌ పోల్స్‌ చాలా సందర్భాల్లో నిజమయ్యాయని, ఈ సారి మాత్రం అవి రాంగైతే సర్వే సంస్థలు విశ్వసనీయతకు పెద్ద దెబ్బ , ప్రజలు నమ్మరని , సర్వే రంగంలో అనుభవమున్న కొందరు నిపుణులు అంటున్నారు. (cartoon curtsy/narsim.


మరింత సమాచారం తెలుసుకోండి: