ఈ వీఎంల లెక్కింపు తర్వాతే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించున్న అధికారు. కౌంటింగ్ ప్రిక్రియలో ఎలాంటి మార్పులేదని స్పంష్టం చేసిన ఈసీ. వీవీ ప్యాట్ల లెక్కింపు పై ప్రతిపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన ఎలక్షన్ కమీషన్.  నెల 23న ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 


ఈవీఎంలకు మూడు సీల్స్ ఉంటాయని, చీటింగ్‌కు అవకాశమే లేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో చీటింగ్ అసాధ్యం అన్నారు. ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదని, కరెక్ట్‌గా ఇవ్వడమే లక్ష్యం అని చెప్పారు.  కాగా, ప్రతిపక్షాలు ముందుగా వివీ ప్యాట్ల లెక్కింపు చేయాలని..అలా చేస్తే చివరి వరకు కౌంటింగ్ సరిగా వస్తుందని..లేదంటే వీవీ ప్యాట్ల విషయంలో ఏదైనా నిర్లక్ష్యం వహించవొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.   


అయితే మధ్యాహ్నం 2 కల్లా ఈవీఎంల కౌంటింగ్ పూర్తవుతుందని ద్వివేది తెలిపారు. టేబుళ్లు, ఓట్లను బట్టి ఫలితం వెలువడుతుందన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్‌ జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదు, కరెక్టుగా ఇవ్వడమే మా ముందున్న లక్ష్యం. మధ్యాహ్నం రెండు కల్లా ఈవీఎంల కౌంటింగ్‌ పూర్తవుతుంది. టేబుళ్లు, ఓట్లను బట్టి ముందు ఫలితం వెలువడుతుంది  అని ద్వివేది పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: