అవును రాష్ట్రంలోని జనాలు ఇపుడిదే చర్చించుకుంటున్నారు. ఒకవైపేమో తన జాతి మీడియాతో రాబోయే ప్రభుత్వం  వృధా ఖర్చులను  తగ్గించుకోవాలని ఉద్భోదలు చేయిస్తున్నారు. స్వయంగా తానే బీదరపులు అరుస్తున్నారు. కానీ తన డాబు, దర్పం ప్రదర్శించే విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఎక్కడికెళ్ళినా ప్రత్యేక విమానాలే. మరి  ఆ ఖర్చంతా తన జేబులో నుండి పెట్టుకుంటున్నారా లేకపోతే పార్టీ భరిస్తోందా ? మంగళవారం ఒక్కరోజు నాలుగు నగరాల మధ్య ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంతో జనాలు విస్తుపోతున్నారు.

 

ఇదంతా చంద్రబాబునాయుడు గురించే అని ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో యూపిఏ వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. అలాగే రాష్ట్రంలో టిడిపి తిరిగి అధికారంలోకి వచ్చేదీ అనుమానమే. అందుకే రాబోయే సమస్యల నుండి తనను తాను రక్షించుకునేందుకు చంద్రబాబు జాతీయ స్ధాయిలో తెగ హడావుడి చేసేస్తున్నారు.

 

చంద్రబాబు ఎంతగా హడావుడి చేసినా జనాలే కాదు జాతీయ స్ధాయి నేతలు కూడా లైట్ గానే తీసుకున్నారు. అందుకు ఢిల్లీలో మంగళవారం జరిగిన పరిణామాలే ఉదాహరణ. ఈవిఎంలు, వివి ప్యాట్ల విషయంలో నానా హడావుడి చేసేందుకు చంద్రబాబు ఓ క్లబ్ లో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి కీలక నేతల్లో చాలామంది రానేలేదు.

 

సరే ఆ విషయాలను పక్కన పెడితే అమరావతి నుండి ఉదయం కోల్ కత్తాకు వెళ్ళారు. అక్కడి నుండి ఢిల్లీలో వాలారు. మళ్ళీ లఖనవులో తేలారు. లక్నో నుండి మళ్ళీ కోలకత్తాకు వెళ్ళారు. కోలకత్త నుండి రెండోసారి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నుండి మళ్ళీ బెంగుళూరు అక్కడి నుండి అమరావతికి చేరుకున్నారు. ఇదంతా కూడా ప్రత్యేక విమానాల్లోనే తిరిగారనే ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. పోని తిరిగిందంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమా అంటే అదీ కాదు. కేవలం వ్యక్తిగత లబ్ది కోసమే తిరిగారు.

 

 

రేపటి కౌంటింగ్ లో టిడిపి ఓడిపోతే తన భవిష్యత్తు ఏంటనే  భయంతోనే తనకు రక్షణగా అందరినీ కలుపుకుంటున్నట్లు కనబడుతోంది. మంగళవారం ప్రత్యేక విమానాల్లో తిరిగిన ఖర్చంతా ఎవరు భరించాలి ? చంద్రబాబేమీ తన జేబులో నుండి ఖర్చుపెట్టారు. అలాగని పార్టీ డబ్బు కూడా వాడరు. మొత్తం ఖర్చంతా భరించాల్సింది జనాలు మాత్రమే. అంటే చంద్రబాబు సొంత వ్యవహారాలకు ప్రత్యేక విమానాల్లో తిరిగినా  మోత మోగేది జనాలకే. అవును చేతికి వాచీ, ఉంగరం కూడా లేని చంద్రబాబు విమానాలకు ఖర్చులెలా భరిస్తారు లేండి ?


మరింత సమాచారం తెలుసుకోండి: