ఏపీలో ఐఏఎస్ లు ఇపుడు ఫలితాలతో సంబంధం లేకుండా జగన్ కొత్త సీఎం అని డిసైడ్ అయిపోయారని టాక్ నడుస్తోంది. కొత్త ప్రభుత్వం వస్తే ఐఏఎస్ లకు వారి ప్రాధాన్యతలు వారికి ఉంటాయి. చంద్రబాబు జమానాలో కొందరు ఐఏఎస్ లు వెలుగు వెలిగారు. నాడు బ్యాక్ బెంచ్ లో ఉన్న వారు ఇపుడు లైం లైట్ లోకి వస్తున్నారు.


జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఎవ‌రికి ప్రాధాన్య‌త ద‌క్కుతుంది. చంద్ర‌బాబు హ‌యాంలో వెలుగు వెలిగిన వారి ప‌రిస్థితి ఏమిటి అనే అంశంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. వైఎస్ హ‌యాంలో కీల‌క పాత్ర పోషించిన వారితో పాటు..కొంత మంది కొత్త వారికి కూడా జ‌గ‌న్ త‌న కొత్త టీమ్ లో చోటు కల్పించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే చాలా మంది అధికారులు ఫ‌లితాల ట్రెండ్ ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసి..చంద్ర‌బాబు ఇంటికి..జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టం ఖాయం అని నిర్ణార‌ణ‌కు వ‌చ్చి త‌ద‌నుగుణంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు.


అంతే కాదు. బాబు వస్తున్నాడని అప్పట్లో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళిపోయిన వైఎస్సార్ బ్యాచ్ సీనియర్ అధికారులు ఇపుదు ఏపీ వైపు తొంగి చూస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సర్వేలు జగన్ సీఎం అని స్పష్టంగా చెప్పాయి. అదే టైంలో ఏపీలో రాజకీయం కూడా మారుతోంది. దీంతో జాగ్రత్త పడిన సీనియర్ ఏఏఎస్ లు జగన్ ప్రభుత్వంలో చోటు కోసం లాబీయింగ్ మొదలెట్టేశారని అంటున్నారు.


జగన్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఐఏఎస్ అజేయ్ కల్లాం, మరో రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ వంటి వారితో ఉన్న పాత పరిచయాలను కూడా ఇపుడు వాడుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ కోసం ఓ వైపు పార్టీ నేతలు క్యూ కడుతూంటే మరో వైపు అధికారులు కూడా వేచి చూస్తున్నారుట. 



మరింత సమాచారం తెలుసుకోండి: