ఆంధ్రప్రదేశ్ లో గత నెల రోజుల నుండి  అందరూ ఉత్కంఠగా వేచి చూస్తున్నా ఫలితాలు రేపు రానున్నాయి.అవి ప్రభుత్వ,ప్రతిపక్షాల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.ఎన్నికల సంఘం రేపు కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రం లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

 

రెండు ప్రధాన పార్టీల ప్రతినిధులు ఉత్సాహంగా మేము ఈసారి 140 సీట్ లు గెలవబోతున్నాం అని మీడియా ముందు గొప్పలు పోతున్నారు.కాని వాళ్ళ పార్టీ కార్యకర్తలలో మరియు పార్టీ కార్యాలయాలలో అలాంటి వాతావరణం కనపడట్లేదు. ఎక్సైట్ పోల్స్ వస్థే కొద్దిగా దైర్యం వస్తుంది అని నమ్మిన పార్టీ క్యాడర్ ఇప్పుడు మరింత అయోమయం లో పడ్డారు.

 

ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.తాము గెలుస్తాం లేదో అని రెండు ప్రధాన పార్టీల క్యాడర్ అయోమయం లో ఉన్నప్పటికీ పైకి మాత్రం గెలుపు తమదే అని లేని ధీమాను నటిస్తున్నారు.ప్రజల తీర్పు ఏ పార్టీ వైపో ఉందో?రేపు ఫలితాలు వచ్చేవరకు తెలియదు.తాము గెలిస్తే మీడియా ముందు ఎం చెప్పాలి?ఒకవేళ ఓడిపోతే ఎం చెప్పాలి?అని ఆలోచించుకోవాడానికి అందరూ ఒక దగ్గరకు చేరి మంతనాలు జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: