దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో  కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశ వ్యాప్తంగా రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అలర్ట్  ప్రకటించింది. కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని పోలీస్ అధికారులకు సూచించింది. ఆయా రాష్ట్రాల సి ఎస్, డీజీపీ లు  గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
కౌంటింగ్ సందర్భంగా హింస తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించిన హోంశాఖ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని పేర్కొంది. కౌంటింగ్‌కు ఆటంకం కలిగించే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది. 
ఇదిలాఉండ‌గా, గ‌రువారం విడుదలకానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రసారం చేసేందుకు ప్రసార భారతి, గూగుల్‌ సంస్థలు చేతులు కలిపాయి. రాష్ర్టాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌స్ట్రీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వార్తా విశ్లేషణ, చర్చల కార్యక్రమాలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసే అంశంపై ఇరు సంస్థలు ఒప్పదం చేసుకున్నాయి. గురువారం రోజు యూట్యూబ్‌ వెబ్‌సైట్‌, యాప్‌లలో పతాక శీర్షికన డీడీన్యూస్‌-ఎన్నికల ఫలితాల సమాచారం లింక్‌ను ప్రదర్శిస్తారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే డీడీ న్యూస్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ఓపెన్‌ అవుతుంది. దాంతో పాటు పలు ఇతర భాషల్లో ప్రసారాలను వీక్షించేందుకు 14 డీడీ రీజియనల్‌ స్టేషన్ల లైవ్‌స్ట్రీమ్‌ ఆప్షన్‌ కూడా ఉందని ప్రసారభారతి ఒక ప్రకటనలో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: