Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jun 21, 2019 | Last Updated 12:32 am IST

Menu &Sections

Search

లైవ్‌ నిరాహార దీక్షలో ' మోజో ' టీవీ సిఇఓ...?

లైవ్‌ నిరాహార దీక్షలో ' మోజో ' టీవీ సిఇఓ...?
లైవ్‌ నిరాహార దీక్షలో ' మోజో ' టీవీ సిఇఓ...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మోజో టీవీ ... అతి తక్కువ సమయంలో ఎక్కువ సంచలనం సృష్టించిన తెలుగు ఛానెల్‌. శబరిమలై కి మారు వేషంలో మహిళా జర్నలిస్టుని పంపి దేశ ప్రజలను ఆకట్టుకుంది. ' మోజో'అంటే.. మెబైల్‌ జర్నలిజం అంటారు. హీరో బాలకృష్ణ అభిమాని చేతిలో సెల్‌ ఫోన్‌ లాక్కుని విసిరి కొట్టినా, హైదరాబాద్‌, పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పడగొట్టి డంపింగ్‌ యార్డ్‌కి తరలించినా,ఆ సంఘటనలను అందరికంటే ముందు కవర్‌ చేసిన ఛానెల్‌ ఇది.

ఇంత సంచలనం సృష్టించిన ఈ వార్తా చానెల్‌ ఈ రోజు తానే సంచలనంగా మారింది. భారత జర్నలిజంలో తొలిసారిగా , మా ఛానెల్‌ కబ్జా అవుతోంది కాపాడండీ అంటూ, ఒక మహిళా జర్నలిస్టు లైవ్‌లో నిరాహార దీక్ష కు దిగారు. '' ఈ లోకమంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తుండగా నన్ను లాక్కెళ్లండి, లైవ్‌లో ఇక్కడే అమరణ దీక్షకు దిగుతున్నాను'' అని సవాల్‌ విసురుతోంది మోజో టీవీ సిఇఓ ,మహిళా జర్నలిస్టు రేవతి.
  '' చాలా టీవీ ఛానెల్స్‌ని కొనేశారు. మా ఛానెల్‌ని కబ్జా చేయాలనుకుంటున్నారు..తెలంగాణలో మీడియా మొత్తం రామేశ్వరరావుకే కావాలా?'' ఇదీ ఆమె ప్రశ్న.

 '' ఇది ఒక కార్పొరేట్‌ ప్రైవెట్‌ మీడియా సంస్దలో జరుగుతున్న పోరాటం. టీవీ9 రవిప్రకాశ్‌ వివాదం మెల్లగా మీడియా స్వేచ్చపై నిర్భందం అనే దిశగా మళ్లిస్తున్న తీరు ఇది.'' అంటున్నారు మీడియా విశ్లేషకులు.

 '' మోజో టీవీ ఛైర్మన్‌ రవికిరణ్‌ ఒక మాజీ పోలీసు అధికారి కుమారుడు. మోజో టీవీలో పెట్టుబడులు పెట్టారు. మొన్నరాత్రి తనతో సంతకాలు చేయించుకున్నారట, సిఒఓ పోస్టులో ఉన్న రేవతి సంతకం ఒక్కటే మిగిలిఉంది...'' ఇవీ మోజో టీవీలో రేవతి లైవ్‌లో చేస్తున్న ఆరోపణలు.

 మోజో టీవీ ఆక్రమణకు మై హోమ్‌ రామేశ్వర్‌రావు ప్రయత్నాలు

 అసలు మోజోలో ఏం జరుగుతోంది ? అని అదే టీవీలో పనిచేస్తున్న సీనియర్‌ జర్నిలిస్టు కస్తూరి శ్రీనివాస్‌ని ఈ విలేకరి ప్రశ్నించినపుడు ఆయనిలా అన్నారు.
 '' మోజో టీవీ ఆక్రమణకు మై హోమ్‌ రామేశ్వర్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చర్యతో మోజో టీవీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లో టీవీ ఛానెల్స్‌ అన్నింటినీ ఆక్రమించే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. మోజో టీవీ ఛైర్మన్‌ హరికిరణ్‌ చేరెడ్డిని పోలీస్‌ స్టేషన్‌లో బెదిరించి షేర్లు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు.
మోజో టీవీ షేర్లను ఉచితంగా రామేశ్వర్‌రావుకి బదిలీ చేయాలని వేధిస్తున్నారు..'' అన్నారు.

 ఒక మహిళా జర్నలిస్టు లైవ్‌లో సవాల్‌ చేస్తూ అరెస్ట్‌ చేసుకోండి .. ఇలాగే నిరాహార దీక్ష చేస్తానంటున్నారు. ఈ రిపోర్ట్‌ రాసే సరికి ఇంకా మోజో టీవీలో డిబేట్‌ నడుస్తోంది. ఈ వివాదాన్ని కాస్త నెమ్మది చేసి, రేపటి ఎన్నికల ఫలితాల అనంతరం 24 వ తేదీన మోజో టీవీ ఉద్యోగులంతా కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరరావు ఇంటి మందు నిరాహార దీక్షకు దిగే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ వివాదం పై ఇంకా జర్నలిస్టు నాయకులు స్పందన వెలువడ లేదు.
రేవతికి ఏసీపీ నోటీసులు జారీ ....?
ఇదిలా ఉండగా,తమ పై 4 నెలల క్రితం  మహిళలకు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నేపథ్యంలో నమోదైన ఒక కేసును తిరగ దోడి కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రేవతి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మోజో టీవీ సిగ్నల్స్‌ కట్‌ అయి ప్రసారాలు నిలిచి పోవడంతో ఆ సంస్ధ యూట్యూబ్‌ ద్వారా ప్రసారాలు చేస్తున్నారు.


mojotv
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Photo Feature - ఆర్ట్‌ ఎటాక్‌..!!
చదువు తూనే కొలువు!!
37 లక్షల ఎకరాలు సస్యశ్యామలం!!
అరకిలో మీటరు ఎత్తునుండి నీళ్లు...
కాళేశ్వరం నిర్మాణంలో రాళ్లెత్తిన కూలీలు ఎవరో....?
ఇక కార్టూన్లు వేయం! ఆ పత్రిక సంచలనం నిర్ణయం..!!
Socialist - అతడు ఊరికి వంతెన అయ్యాడు!!
Photo Feature - మరో  సుందర రామం,   శనివారం ప్రారంభం
Exclusive- వీళ్లు ,మామిడిపండ్లను ఏం చేస్తారో తెలిస్తే షాక్‌...!!
Exclusive - పుష్సశ్రీవాణి గారూ? మా బడి కి దారి ఏదీ…?
Reality check- ఒక లేడీ జర్నలిస్టు డైరీ..!!
Innovative- ఈ రైతు ఆలోచన వింటే షాక్‌ !!
యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని చెప్పిన సినిమా...
SuccessStory- గిరిజనుల పాలిట దేవుడు...!!
ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ఏడు నెలల గర్భిణి.. 6వందల కిలోమీటర్ల ప్రయాణం!!
వారు అడవిని ప్రేమించడం వెనక రహస్యం... ?
ధర్మ దేవత కళ్లు తెరిచింది... వాళ్లు బతికి పోయారు!!
ఆ 'పత్రిక' అంతు చూస్తాం...?
 కాగజ్‌నగర్‌ అడవుల్లో అసలేం జరిగింది..?
Life- 'జ్యోతి '  బిడ్డను ఎందుకు అమ్ముకోవాలనుకుంది ...!!
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.