మరో మూడు గంటల్లో ఈవీఎంలు నోళ్ళు తెరచుకోబోతున్నాయి. జనం తీర్పును సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టనున్నాయి. ఏపీలో సునామీ వుంటే అది ఎక్కడ అలజడి స్రుష్టిస్తుందో కూడా చెప్పేస్తాయి. ఏపీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న నగ్న సత్యాన్ని ఈవీఎంలు శోధించి జనానికి చెప్పనున్నాయి. ఏపీలో హోరా హోరీ పోరు జరిగిన సంగతి తెలిసిందే. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎవరూ మేము తక్కువ తినలేదు అంటున్న సందర్భమిది.


అధికార టీడీపీ మళ్ళీ పవర్లోకి వస్తుందా. పదేళ్ళ పాటు జనంలోనే ఉన్న జగన్ కష్టానికి జనం  భారీ కూలి ఇవ్వబోతున్నారా అన్నది ఈ జడ్జ్-మెంట్ డే చెప్పేస్తుంది. ఉదయం ఎనిమిది గంటలకు ఈవీఎంల సీలు వీడుతుంది. ఆ తరువాత గటగటా ఫలితాలు దొర్లుకుంటూ అవే  వచ్చేస్తాయి. మరి అవి  కేక్ ఎవరి చేత తినిపించబోతున్నాయి, షాక్ ఎవరికి ఇవ్వబోతున్నాయి అన్నది తెలుసుకునేందుకు కొద్ది గంటలు మాత్రమే ఉంది.


ఏపీలో జగన్ సునామీ ఉందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఏకంగా 130 సీట్లకు పైగా గెలుచుకుంటామని కూడా బల్లగుద్ది మరీ చెబుతోంది. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు 130 సీట్లు తమకే వస్తాయని చెబుతున్నారు. మరి 130 అంటే ప్రభంజనమే. అయిదేళ్ళ పాటు పాలించిన తరువాత కూడా భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తే టీడీపీకి ఏపీలో తిరుగులేనట్లే. 2014లో 105 సీట్లను తెచ్చుకున్న టీడీపీ ఇపుడు ఇన్ని ప్రతికూలతల మధ్య మరో పాతిక సీట్లు అదనంగా తెచ్చుకుంటే అది బంపర్ విక్టరీయే.


ఇక గత ఎన్నికల్లో కేవలం అయిదున్నర లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ 67 సీట్లకు పరిమితం అయ్యారు. ఇపుదు 130 అంటే డబుల్ అయినట్లు అన్న మాట. అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు లాంటి రాజకీయ గండర గండడితో పోరాడటమే కాదు, పార్టీని నిలబెట్టుకుని మరీ తొడకొట్టి సవాల్ చేయడం అంటే అదంత ఆషా మాషీ వ్యవహారం కానే కాదు. ఇక 130 సీట్లు తెచ్చుకుని టీడీపీని 45 సీట్లకే పరిమితం చేయడం అంటే గత ఎన్నికల కంటే సగానికంటే కూడా తగ్గించేసినట్లు. ఆ ఫీట్ సాదిస్తే వైసీపీ ప్రభంజనం  బలంగా వీచినట్లే. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: