పాతికేళ్ల పాటు పార్టీని నడిపే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతారు.. ఆల్రెడీ పార్టీ పెట్టి ఐదేళ్లు దాటింది. ఇంకా ఓ రూపం అంటూ లేదు. పోనీ లేటు గా వచ్చినా సీరియస్ నెస్ ఉందా అంటే అదీ కనిపించడం లేదు. 


ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హడావిడి పార్టీల్లో నాలుగైదు రోజులుగా ఉంది. టీడీపీ, వైసీపీ వంటి పార్టీలు తమ ఏజంట్లకు శిక్షణ ఇస్తున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కౌంటింగ్ డే కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవగా జనసేన ఆ విషయాన్నే మరిచిపోయింది.

వైసీపీ, టీడీపీ కౌంటింగ్ రోజు కోసం ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. తెలుగుదేశం కూడా ముందస్తుగానే సిద్ధమై కౌంటింగ్ రోజు కోసం కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చింది. 

ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం చూపలేకపోయిందన్న నైరాశ్యమో, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన షాకో తెలియదు కానీ- కౌంటింగ్ డే గురించి జనసేన పూర్తిగా మర్చిపోయింది. ఆ పార్టీ నేతల్లో చాలామంది రాజకీయాలకు కొత్తకావడంతో కౌంటింగ్ ఏజెంట్లన నియమించడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. 

కౌంటింగ్ ఏజెంట్లను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉండడం ఏ పార్టీకైనా ప్రమాదమే. పార్టీని పాతికేళ్లు నడిపే తీరు ఇదేనా అన్న ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం మాత్రం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: