మరికాసేపట్లో ఎన్నికల  ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి.  కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఏపీలో మొదటి ఫలితం నరసాపురం నుంచి వస్తుంది.  చివరి ఫలితం రంపచోడవరం నుంచి వెలువడుతుంది.  ఇక ఇప్పుడు  అందరి దృష్టి ఎవరికీ ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వబోతున్నారు.  ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే విషయాలపై ఉన్నది.  


గతంలో పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో నంద్యాల నుంచి భారీ మెజారిటీతో గెలుపొందాడు.  ఆ తరువాత వైఎస్ జగన్ భారీ మెజారిటీతో గెలిచారు.  జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైకాపా పార్టీ పెట్టిన తరువాత పులివెందుల నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీ సాధించారు.  అంతకు ముందు వైఎస్ రాజశేఖర్  రెడ్డి, చంద్రబాబులు కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.  


అయితే, ఇప్పుడు ఎవరు ఎలాంటి మెజారితో గెలుపొందబోతున్నారు.  ఎవరికి ప్రజలు ఎక్కువ ఓట్లు వేశారు అనే విషయాలు ఆసక్తిగా మారాయి.  మరి కాసేపట్లోనే ఈ విషయాలు తేలిపోనున్నాయి.  ఈసారి కొత్తగా జనసేన పార్టీ పోటీలో నిలిచింది.  జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజక వర్గాల నుంచి పోటీలో ఉన్నారు.  ఈ రెండు నియోజక వర్గాల్లో ఎక్కడి నుంచి గెలుస్తారు.  ఎంత మెజారిటీ ఓట్లతో గెలుపొందుతారు అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.  నారా లోకేష్ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు.  వీరి భవితవ్యం ఏంటి అనేది కొద్దిసేపట్లోనే తేటతెల్లం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: