రెండు నెలలుగా ఏపీలో ఎంతో ఉత్ఖంటతో ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ కి నేటితో తెరపడనుంది. ఒక పక్క పందెం రాయళ్ళు, మరో పక్క పార్టీపై వల్లమాలిన అభిమానంతో ఉండే కరుడుగట్టిన అభిమానులు.  అభ్యర్థులు ఇలా ప్రతీ ఒక్కరూ ఎంతో ఆత్రుతతో, ఆందోళనతో ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు సర్వేలు అన్నీ జగన్ కి పట్టం కడుతుంటే టీడీపీ కి చావు దెబ్బ తప్పదని అంటున్నాయి. ఇక జనసేన సోదిలోకి కూడా లేదు. అయితే

 Image result for watching elections results

అభ్యర్ధులు మొదలు వారి వెంట తిరిగిన అనుయాయులు, తమ పార్టీ పక్కా వచ్చేస్తుందని గొడవలు పడే సోగ్గాళ్ళు ఇలా ఎంతో మంది ఈరోజు రాబోయే రిజల్స్ ఎదురు చూస్తున్నారు. రిజల్స్ మధ్యాహ్నం లోగానే తెలిపోనుండటంతో అందరూ కదలకుండా టీవీల ముందు కూర్చునే  ఉండే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే  ఉత్కంటగా రిజల్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. రిజల్స్ వీక్షించే వారిలో బీపీ, షుగర్, తదితర జబ్బులు ఉన్న వాళ్ళు రిజల్స్ చూసే సమయంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలని సూచిస్తున్నారు.

 

  • టీవీల ముందు ఒక్కరు మాత్రం కూర్చోవద్దని , ఇద్దరు లేదా ముగ్గురు ఉండటం మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఫలితాల గురించి పక్కన వారితో చర్చస్తున్న సమయంలో ఒత్తిడి తగ్గినట్లుగా ఉంటుంది తద్వారా ఎటువంటి మానసిక ప్రభావం ఉండదు.

 

  • ఫలితాలను ఉగ్గబట్టి చూడకుండా కొద్ది నిమిషాల పాటు అటు ఇటూ తిరుగుతూ ఉండటం మంచిది.

 

  • మంచి నీళ్ళని అరగంట కి ఒక్కసారైనా తాగుతూ ఉండాలి. ఉత్కంఠతతో ఎదురు చూస్తూ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి.  

 

  • మీరు వీక్షితున్న చానెల్ లో బ్రేక్ వస్తే ఆ ఛానల్ కొనసాగించడం అంతేకాని వేరే ఛానెల్ ని మాత్రం మార్చవద్దు. ఎందుకంటే యాడ్స్ చూడటం వలన ఒత్తిడి తగ్గుతుంది.

 

  • ఎప్పటికప్పుడు మంచి నీళ్ళతో పాటు శక్తివంతమైన పానీయాలు త్రాగుతూ ఉండటం మరింత మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: