తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి 4 నెలలు అయింది.  తెరాస పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరిగాయి కాబట్టి ఇక్కడి ఫలితాలపై అంత పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.  శాసనసభ ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది.  దీంతో లోక్ సభ ఎన్నికల్లోనూ అదే విధంగా గెలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.  


గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది విజయం సాధించారు.  ఈ 19 మందిలో దాదాపు 10 మంత్రి ఎమ్మెల్యేలు కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ ను వీడి కారెక్కారు.  శాసనసభలో ప్రతిపక్షమే లేకుండా పోవడంతో కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కొన్ని సీట్లు సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.  


ఇక బీజేపీ విషయానికి వస్తే... సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ తో పాటు మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలపై కన్నేసింది.  ఈ స్థానాల్లో గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసింది.  ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 1 నుంచి 3 స్థానాల్లో గెలుపొందుతుంది అని చెప్పడంతో ఆ పార్టీ నేతలు కనీసం ఆ స్థానాలైన గెలుచుకోవాలని చూస్తున్నారు.  తెరాస మాత్రం 17 స్థానాలకు గాను 16 స్థానాలు కైవసం చేసుకుంటామని అంటోంది.  ఎంఐఎం కూడా హైద్రాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని అంటోంది.  మరి ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారనే విషయం మరికాసేపట్లో తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: