నారా లోకేష్ చాలా పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తున్నారు. ఈ రోజును చీకటి దినంగా ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కాబోతున్న తరుణంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బాబు ఈ రోజును 'చీకటి దినం'గా తేల్చేశారు! ఎందుకు అలా అంటే.. ఎన్నికల కమిషన్ వీరి డిమాండ్ కు ఒప్పుకోలేదట. అందుకే ఇది ప్రజాస్వామ్యానికి చీకటిదినం అని లోకేష్ సెలవిచ్చారు.


అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చంద్రబాబు అయినా మాట్లాడాలి, ఆయన తనయుడుగా లోకేష్ అయినా మాట్లాడాలి! ఇంతకుమించి ఎవరికీ ఆ అర్హతే లేదు! ఐదేళ్లుగా వీరు ప్రజాస్వామ్యానికి చేసిన సత్కారాలు ఎన్నో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి వీళ్లే మాట్లాడాలి. ఎన్నికల కమిషన్ ను వీరు కోరిన తాజా కోరిక ఏమిటంటే.. లెక్కించే ఐదు వీవీ ప్యాట్ లకు సంబంధించి ముందుగా స్లిప్పులను ఎంచాలట!


ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కబెట్టాలట. ఏదో ఒక పేచీ పెట్టే ఉద్దేశం తప్ప ఈ డిమాండ్లో ఉన్న సత్తా ఏమిటో అందరికీ అర్థం అవుతున్నదే. ముందుగా ఈవీఎంలలో ఓట్లను లెక్కపెడితే, ఏమిటీ వీవీ ప్యాట్ లను లెక్కిస్తే ఏమిటి.. ఏది ముందుచేసినా, ఏది తర్వాత చేసినా కౌంటింగ్ ఏజెంట్ల ముందే కదా అంతా జరిగేది!  అలాంటప్పుడు ఇలా గోలచేయడం ఎందుకో చంద్రబాబుకు, లోకేష్ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: