ఎప్పుడు లేని విధంగా 2019 ఎన్నికలు ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి. దేశంలో తొలిసారి అత్యంత భారీ పోలింగ్ నమోదు అయ్యిందని ఎన్నికల కమిషన్  గణాంకాలు చెబుతూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత శాతం ఓటింగ్ ఎప్పుడూ నమోదు కాలేదని సీఈసీ ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల విషయంలో కూడా ఎవరి విశ్వాసం వారిదిలా కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు విజయం తమదనే విశ్వాసాన్ని వ్యక్తంచేస్తూ ఉన్నారు. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్  పోల్ సర్వేలు-ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని పేర్కొన్నాయి.


ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. అది ప్రముఖుల విజయావకాశాల విషయంలో. జాతీయ స్థాయిలో కొందరు ప్రముఖులకు ఓటమి తప్పదనే విశ్లేషణలూ ఉన్నాయి. బోలెడంత మంది సెలబ్రిటీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏపీలో, మిగతా రాష్ట్రాల్లో రాజకీయ వారసులు, ప్రముఖ సినిమా హీరోలు పోటీ చేశారు. వారు గెలుస్తారా.. ఓడతారా.. అనేది సందేహంగానే ఉంది. ఈ సందేహం తీరడం సంచలనంగా నిలవబోతూ ఉంది.


ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతూ ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ తో ఫలితాల సరళిపై క్లారిటీ రానుంది. మధ్యాహ్నానికళ్లా ఫలితాలు ఎలా  ఉంటాయనే అంశంపై దాదాపుగా స్పష్టత వస్తుంది. ఈవీఎంల కౌంటింగ్ తో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించీ ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులు కూడా కౌంటింగ్ జరగాల్సి ఉండటంతో పూర్తి ఫలితాల వెల్లడి మాత్రం ఆలస్యం కావొచ్చు. అధికారిక ప్రకటనలు రావడానికి గురువారం అర్ధరాత్రి కావొచ్చని ఎన్నికల కమిషన్ అధికారులే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: