ఏపీలో ఓట్ల లెక్కింపులో మొట్టమొదటి రిజల్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్థానం వెలువడనుందని తెలుస్తోంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గ రిజల్స్ కూడా ముందుగానే తెలియనుంది. మొదటి ఫలితం వెలువడే స్థానాలలో రెండు కూడా వైసీపీ పార్టీ గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు అయిపోతుంది.

 Image result for ap elections 2019

ఇదిలాఉంటే కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక  పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లున్నాయి. అందువల్ల ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Image result for ap elections 2019

ఎన్నికల సరళి, ఫలితాలని ఎప్పటికప్పుడు చెప్పడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి అవగానే కౌంటింగ్‌ కేంద్రం దగ్గర మైక్‌లో చెబుతారు. అలాగే మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్ప్లే లు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్‌ చేయబోతున్నారు.దేశవ్యాప్తంగా ఫలితాలని తెలుసుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్సైటు ని కూడా ఏర్పాటు చేసింది. https://results.eci.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు వోటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా ఫలితాలని పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: