ముందుగా లెక్కింపు మొదలైన పోస్టల్ బ్యాలెట్లలో వైసిపి ముందంజలో ఉంది. అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని సుమారు 10 నియోజకవర్గాల్లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైసిపి ఆధిక్యతలో ఉంది. గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా కీలకమైన దశలో వీటికి ప్రాధాన్యత పెరిగిపోయింది.

 

పోస్టల్ బ్యాలెట్ల ప్రాధాన్యతను గుర్తించా కాబట్టే అన్నీ పార్టీల అభ్యర్ధులు పోస్టల్ బ్యాలెట్లను తమకు అనుకూలంగా వేయించుకునేందుకు నానా అవస్తులు పడ్డారు. దాంతో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లకు కూడా విపరీతమైన గిరాకీ వచ్చేసింది.

 

మొత్తం మీద దాదాపు 3.5 లక్షల పోస్టల్ బ్యెలెట్లను ఉద్యోగులు ఉపయోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులుంటే అందులో కొందరికి ఉద్దేశ్యపూర్వకంగానే పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని వైసిపి నేతలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ఆరోపించాయి. సరే ఏదేమైనా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఇప్పటికైతే వైసిపినే ఆధిక్యతలో ఉంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: