నగరి నియోజక వర్గంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.  2014 ఎన్నికల్లో నగరి నుంచి సినీనటి రోజా విజయం సాధించింది.  టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు పై స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది.  తేడా కొద్దిగా మాత్రమే ఉండటంతో ఈసారి టిడిపి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.  అయితే, ఈసారి ఆ స్థానం నుంచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ టీడీపీ నుంచి బరిలోకి దిగారు.  

గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తరువాత ఈ మార్పు జరిగింది.  సింపతీ ఓట్లు అన్ని టిడిపికి పడతాయని టిడిపి అభిప్రాయం.  నగరి నుంచి మళ్ళీ తానే విజయం సాధిస్తానని అంటోంది రోజా.  నగరి తమిళనాడు బోర్డర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ తమిళ ఓటర్ల ప్రభావం కూడా ఉంటుంది.  ఇది రోజాకు కలిసి వచ్చే అంశం.  గతంలో కూడా ఈ నియోజక వర్గంలో తమిళ ఓటర్ల వలనే రోజా విజయం సాధించింది.  

ఈసారి కూడా రోజా విజయం సాధిస్తుందా అన్నది తెలియాలి.  గత ఐదేళ్ళలో రోజా నగరి నియోజక వర్గానికి చేసింది ఏమి లేదని,అలాంటప్పుడు ఆమెను ఎందుకు గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారని కొందరి అభిప్రాయం.  అయితే, ఈసారి వైకాపా గాలి వీస్తుండటంతో ఆ గాలి నగరి వైపు కూడా వీస్తుందని తప్పకుండా రోజా విజయం సాధిస్తుందని అంటున్నారు.  మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: