Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

శ్రీకాకుళం MP విజేతలేవరు...?

శ్రీకాకుళం MP విజేతలేవరు...?
శ్రీకాకుళం MP విజేతలేవరు...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి అన్ని పార్టీలూ అభ్యర్థులను ప్రకటించేశాయి. వారి నామినేషన్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన వారి కంటే ముందుగా టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థి పేరు ఖరారు చేసింది. సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌నాయుడును మరోసారి బరిలోకి దించింది. అనేక సమాలోచనలు, టెన్షన్‌ల నడుమ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు డోల జగన్‌, జనసేన నుంచి మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి మెట్ట రామారావు, బీజేపీ నుంచి నగల వ్యాపారి పేర్ల సాంబమూర్తి శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్లు వేశారు. టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి.. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మినహా.. మిగిలిన వారంతా పార్లమెంటు బరికి కొత్తవారే.
 
ఈ నేపథ్యంలో జిల్లా అంతటా అభ్యర్థుల బలాబలాలపై చర్చ సాగుతోంది. అధికార పార్టీలో దూసుకుపోతున్న సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌నాయుడును ఢీ కొట్టేందుకు ఇతర పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఎంతవరకు ఫలిస్తాయనేది చర్చనీయాంశమవుతోంది. వార్‌ వన్‌సైడ్‌ అని టీడీపీ శ్రేణులు భావిస్తుండగా... ఈసారి తాము గట్టి పోటీ ఇచ్చి తీరుతామని వైసీపీ నేతలు సవాల్‌ విసురుతున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ, వైసీపీతో పాటు ఇతర పార్టీల ఎంపీ అభ్యర్థుల బలాబలాలను పరిశీలిద్దాం.


కేంద్రమాజీ మంత్రి ఎర్రన్నాయుడు మరణాంతరం.. ఆయన వారసుడిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు రాజకీయ ప్రవేశం చేశారు. 2014 ఎన్నికల్లో సైకిల్‌యాత్రను ప్రారంభించి.. జిల్లా అంతటా చుట్టేశారు. సమస్యలపై అవగాహన ఏర్పరచుకుని ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచి.. పార్లమెంట్‌లో జిల్లావాణి వినిపించి గుర్తింపు పొందారు. అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తూనే పార్లమెంట్‌ సాక్షిగా ప్రధానమంత్రి మోదీనీ సైతం ప్రశ్నలతో నిలదీశారు. రైల్వేజోన్‌, ప్రత్యేకహోదా.. ఇతరత్రా అంశాలపై తనకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. జిల్లాలో కూడా దీక్షలు నిర్వహించి.. నిరసన గళమెత్తారు. మరోవైపు నాలుగున్నరేళ్లుగా పార్టీ కార్యక్రమాలతో ప్రజలకు చేరువై.. వారి ఆదరణ పొందారు. ఎర్రన్నాయుడి వారసుడిగా అడుగుపెట్టి.. తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం రామ్మోహన్‌నాయుడునే మరోసారి పార్లమెంట్‌ బరిలో దించింది.


వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీను విషయానికొస్తే.. ఆయన టెక్కలి నుంచి మూడుసార్లు అసెంబ్లీ స్థానానికి పోటీపడ్డారు. అసంతృప్తి, అలకలతో ఇప్పటివరకూ మూడు పార్టీలు మారారు. ముందు కాంగ్రెస్‌లో ఉన్న దువ్వాడ.. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థిగా నిలిచిన గొర్లె హరిబాబునాయుడుకి మద్దతు ఇచ్చారు. దీంతో ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. తర్వాత సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కొర్ల రేవతీపతిపై ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే రేవతీపతి అకాల మరణం అనంతరం.. టెక్కలిలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసిన దువ్వాడ.. డిపాజిట్లు కూడా కోల్పోయి.. రేవతీపతి భార్య భారతి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2013లో వైసీపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం దువ్వాడ.. వైసీపీ పార్లమెంట్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తర్వాత పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత ఈసారి టెక్కలి అసెంబ్లీకి పేరాడ తిలక్‌కు టిక్కెట్‌ ఖరారు చేశారు. దువ్వాడ శ్రీనును శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో దించారు.


కాంగ్రెస్‌ పార్టీ ఎమ్పీ అభ్యర్థి డోల జగన్‌ కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నరసన్నపేట నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. తర్వాత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన డోల.. ఈసారి పార్లమెంట్‌ బరిలో దిగడం మరింత ఇబ్బందికరమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున డోల జగన్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కత్తిమీద సామే అన్న చందంగా ఉంది.


జనసేన ఎంపీ అభ్యర్థి మెట్ట రామారావు.. జిల్లాకు చెందిన వ్యక్తే. ఆయన ఐఆర్‌ఎస్‌ అధికారి. ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి... జనసేన తరఫున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ జిల్లావాసులతో పెద్దగా పరిచయం లేదు.


బీజేపీ ఎంపీ అభ్యర్థి పేర్ల సాంబమూర్తి.. శ్రీకాకుళం, విశాఖపట్టణంలలో నగల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దఫా బీజేపీలో ఎంపీ టిక్కెట్‌ను మాజీ ఎంపీ కణితి విశ్వనాథం ఆశించారు. ఆయనవైపు అధిష్టానం మొగ్గు చూపలేదు. మరో సామాజిక వర్గం కూడా టిక్కెట్‌ ఆశించినా నిరాశే ఎదురైంది. చివరికి సాంబమూర్తికి టిక్కెట్‌ కేటాయించింది. అయితే మామూలుగానే బీజేపీకి జిల్లాలో పెద్దగా బలం లేదు. దీనికితోడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ కేటాయింపు విషయంలో కేంద్రం తీరుతో ఆ పార్టీపై ప్రజలు మరింత గుర్రుగా ఉన్నారు. 


ఏదిఏమైనప్పటికీ ఈ సారి పార్లమెంట్‌ ఎన్నిక టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ జరిగినా.. అధికార పార్టీ అభ్యర్థికే మరోసారి పట్టం కట్టే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం తాము బరిలో ఉన్నామని చెప్పుకునేందుకు వీలుఏర్పడింది. జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల ప్రజలు ఎవరిపై మక్కువ చూపుతారో ఈ రోజే తెలనుంది.
srikakulam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు విజయవాడకు కేసీఆర్
నేడు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ
అదా కర్రసాము సూపరో సూపర్.
నిద్రపోను...అధికారులను నిద్రపోనివ్వను.
'వజ్ర కవచధర గోవింద' 50 వసూల్
ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు గన్ మెన్ల తొలగింపు!
సెగలు పుట్టిస్తున్న రియా..!!
మరో రెండు రోజుల్లో రుతుపవనాలు... ఆర్టీజీఏస్ వెల్లడి
రాజధాని నిర్మాణంపై బోత్స వాఖ్యలు
నేడు ఆశక్తిభరితంగా భారత్-పాక్ మధ్య క్రికెట్ పోరు
నీతి ఆయోగ్ లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ డిమాండ్
ఎక్సైజ్‌ శాఖలో త్వరలో మార్పులు.. మంత్రి నారాయణస్వామి
బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
సింగిల్ గా హ్యాపీ అంటున్న శృతి
ఏపీకి హోదా సాధనే జగన్ అజెండా
జిందాబాద్ జిందాబాద్.. ఇస్మార్ట్ సాంగ్ రీలీజ్
అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రారంభ వేడుకలు
వృద్ధి రేటుపై దృష్టి పెట్టండి.. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక వేత్తల సూచనలు
ట్రంప్ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ డిజైన్ ఇదే..
ఆనందంలో గాల్లో ఎగిరిన పూజ
రక్త దానం - మహాదానం
రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్న కేంద్ర తొలి వ్యవసాయ బడ్జేట్
అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అవినీతి రహిత పాలన కోసమే మా ప్రభుత్వం కృషి... సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం
స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
‘మన్మథుడు2’ టీజర్ టాక్!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకరించనట్లేనా!
నారాయణ స్కూల్ బుక్స్ అంటే అమ్మో అనాల్సిందే!
పోలవరం నిర్మాణానికి రూ.3వేల కోట్ల విడుదలకు అంగీకారం
మొదలైన జగన్ ఆట .. మొదటి వికెట్ నారాయణ ..!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు కీలక పదవి!
చంద్రబాబు కాన్వాయిపై టీడీపీ నేతల ఆందోళన
గోపిచంద్ చాణుక్య పోస్టర్ రీలిజ్
అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ రిలీజ్
కర్నూలులో అల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.