అందరూ ఊహించినట్లుగానే  భీమవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనకంజలో ఉన్నారు. అవటానికి ఇది పోస్టల్ బ్యాలెట్లే అయినప్పటికీ ఇక్కడ వచ్చే ఆధిక్యతలు కూడా చాలా ఇంపార్టెంటే అన్న విషయం తెలిసిందే. అందుకనే పోస్టల్ బ్యాలెట్ల విషయంపైన కూడా రెండు ప్రధాన పార్టీలు బాగా దృష్టి పెట్టాయి.

 

 

ఇక్కడ ప్రస్తుత విషయానికి వస్తే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేశారు. ఎప్పుడైతే పవన్ పోటీ ఖరారైందో అప్పటి నుండో గెలవడనే అంచనాలు మొదలయ్యాయ.

 

దానికి తగ్గట్లే పవన్ కూడా నియోజకవర్గంలో ప్రచారం విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. మొత్తానికి దాని ప్రభావం ఏమిటో ఇపుడు కనిపిస్తోంది. ఉదయం మొదలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో పవన్ వనకబడిపోయారు. సాక్ష్యాత్తు పార్టీ అధ్యక్షుడే వెనకడబడిపోతే ఇక మిగిలిన అభ్యర్ధుల విషయం చెప్పేదేముంది. మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో వైసిపి 65 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండటం వైసిపికి శుభారంభం అనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: