కొన్ని సంస్థలు కొన్ని ప్రామాణిక పద్ధతులలో సర్వే లను జరిపి ఎవరు అధికారం లోకి రాబోతున్నారు అనే విషయాన్ని ఫలితాల కంటే ముందు ఎక్సీట్ పోల్స్ తో చెప్తారు.అలాగని ఎక్సీట్ పోల్స్ లో వచ్చిన ఫలితాలు ప్రతిసారీ నిజమయ్యాయి అంటే కాదు అనే చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200లోను 2014 లోను చాలా వరకు ఎక్సీట్ పోల్స్ విఫలం అయ్యాయి.కాని ఈసారి ఇచ్చిన ఎక్సీట్ పోల్స్ రాష్ట్రం లో దేశం లో నిజం అయ్యేలా ఉన్నాయి.

 

కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి ముందే మొదలయ్యింది.అప్పుడే కేంద్రం స్థాయిలో బీజేపీ చాలా స్థానాలలో యుపిఎ  మరియు ఇతరులు కంటే ముందంజ లో ఉన్నది.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ టీడీపీ కంటే ముందంజ లో ఉన్నది.ఇదే పరిస్థితి మరో కొన్ని గంటల పాటు నెలకొన్నదంటే ఎక్సీట్ పోల్స్ చెప్పినట్లు ఖచ్చితంగా ఫలితాలు జరుగుతాయి.

 

ప్రస్తుతం ఆధిక్యం లో ఉన్నా పార్టీలు తమ ఆధిక్యతను తర్వాత కౌంటింగ్ రౌండ్-లలో కోల్పోవచ్చు కావున అప్పుడే ఎవరు గెలుస్తారో చెప్పే అవకాశం లేదు.మరికొన్ని రౌండ్లు పూర్తయితే గాని ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో ఓ అంచానికి రాలేము. ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రకటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: