పోస్టల్ బ్యాలెట్లలో వైసిపికి స్పష్టమైన ఆధిక్యత సాధించిందని అర్ధమైపోయింది. చాలా నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తియిపోయి రెగ్యులర్ ఈవిఎంల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యత సాధించిన వైసిపి ఈవిఎంల లెక్కింపులో కూడా ముందంజలోనే ఉన్నట్లు అర్ధమైపోతోంది. ఇదే ట్రెండ్స్ మరో మూడు రౌండ్లు కూడా కంటిన్యు అయితే వైసిపికి బంపర్ మెజారిటీ దక్కటం ఖాయమనే అనిపిస్తోంది.

 

తాజా సమాచారం ప్రకారమైతే మొదటి రౌండ్ కు వైసిపి 105 నియోజవర్గాల్లో స్పష్టమైన లీడ్ లోకి దూసుకెళ్ళింది. అలాగే టిడిపి 23 నియోజకవర్గాల్లో ఆధిక్యతను దక్కించుకున్నది. జనసేన రెండు చోట్ల ముందంజలో ఉంది. వైసిపి లీడ్స్ లో ఉన్న నియోజకవర్గాల్లో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు తదితరులు కూడా వెనకంజలోనే ఉన్నారు.

 

ఎన్నో మాటలు చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వెనకబడే ఉన్నారు. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లోను మొదటి నుండి వెనకబడే ఉండటం గమనార్హం. ఇదే ట్రెండ్స్ గనుక మరో మూడు రౌండ్లలో కూడా కంటిన్యు అయితే వైసిపి బంపర్ మెజారిటీ వస్తుందనటంలో సందేహం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: