తొలి నుంచి స్ప‌ష్ట‌మైన సంకేతాల‌తో సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ట్రెండ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ దూకుడుగా ఉంది.  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. ఇందులో మెజార్టీ చోట్ల తొలి ఫలితాల్లోనే ఫ్యాన్‌ దూసుకుపోతోంది.  లెక్కింపులో వైఎస్సార్‌ పార్టీ  అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు పులివెందుల నియోజకవర్గంలో జననేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన హవాను చాటుతున్నారు.


అయితే, ఈ ప‌రిణామాం తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ కంపెనీ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఏపీ ఎన్నికల్లో ప్రారంభం ట్రెండ్స్‌లో టీడీపీ వెనుకంజలో ఉండటంతో ఆ కంపెనీ షేర్‌పై ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ.475 వద్ద ముగిసిన హెరిటేజ్‌ షేర్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే పది శాతంపైగా నష్టపోయి రూ. 411కి పడిపోయింది. తరవాత కోలుకుని ఇపుడు రూ. 453 వద్ద ట్రేడవుతోంది. ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ కౌంటర్‌ బాగా ప్రభావం చూపుతోంది.


ఇదిలాఉండ‌గా, పోస్టల్‌  బ్యాలెట్‌ లెక్కింపులో అధికార తెలుగుదేశం పార్టీకి  ఊహించినట్టుగానే  భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి తీవ్రంగా తిరస్కరించారు. దీనికి ప్రతిఫలంగా పోస్టల్‌ బ్యాలెట్‌  ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి ఈ లెక్కింపులో గణనీయమైన మెజార్టీ లభిస్తోంది. ఐదేళ్లుగా అధికార తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ తెగించి పోరాడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కౌంటింగ్‌లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. విజయం పట్ల పార్టీలోని అన్నిస్థాయిల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ కల నెరవేరబోతోందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: