జగన్ పార్టీ ఏపీలో సునామీ సృష్టిస్తుంది. ఫ్యాన్ ధాటికి సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. క్లీన్ స్వీప్ చేసుకుంటూ దూసుకుపోతుంది. మంగళగిరిలో సుమారు 900 పైగా ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్ కౌంటింగ్ ముగుస్తున్న సమయానికి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'ఫ్యాన్' స్పీడ్ అందుకుంది. ఏకంగా వందకు పైగా అసెంబ్లీ సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండటం గమనార్హం.


తెలుగుదేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లలో మాత్రమే ఆధిక్యత సంపాదించింది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లలో ఆధిక్యత కనబరుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ సీట్లలో ఆధిక్యతను కలిగి ఉంది. సంచలన అంశం ఏమిటంటే.. కుప్పంలో చంద్రబాబు నాయుడు వెనుకబడటం.


రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళి అరవై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ వెనుకబడి ఉండటం గమనార్హం.  ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీలు సాధిస్తూ ఉన్నారు. ఈ ధాటి చూస్తూ ఉంటే.. ఏపీలో ఫ్యాన్ సునామీ సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: