ఏపీలో నెల్లూరు జిల్లాలో వైసీపీ సునామి క్రియేట్ చేస్తుంద‌ని ముందు నుంచి అంద‌రూ అనుకున్నారు. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఎగ్జిట్‌పోల్స్ సైతం నెల్లూరులో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక టీడీపీ ఈ సారి క‌నీసం 3 -5 స్థానాల్లో గెలుస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్నా ఈ ఆశ‌ల‌న్నీ ఫ‌లితాల్లో రివ‌ర్స్ అయ్యాయి. నెల్లూరు ఎంపీ సీటుతో పాటు మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులే ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇక్క‌డ టీడీపీ ఖాతా తెరిచే ప‌రిస్థితి లేదు.


సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి సంజీవయ్య 1476, వెంకటగిరిలో 2478 ఓట్ల మెజారిటీలో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లిలో 1750 ఓట్ల ముందంజలో వైసీపీ అభ్యర్థి కాకాణి కొనసాగుతున్నారు. గూడూరులో 1700 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వరప్రసాద్, నెల్లూరు సిటీలో 2473 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి అనిల్, నెల్లూరు రూరల్‌లో 3000 ఓట్ల మెజార్టీలో వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో 3240 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ గౌతంరెడ్డి, కావలిలో 303 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరులో వైసీపీ అభ్యర్థి 1800 ఓట్ల ఆధిక్యం, ఉదయగిరిలో 2700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుళ్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: