ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతోన్న వేళ టీడీపీ కంచుకోట‌లు కూలిపోతున్నాయి. టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న అనంత‌పురం, కృష్ణా, గుంటూరు, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు టీడీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఉత్త‌రాంధ్ర జిల్లాలో కూడా వైసీపీ ఖాతాలో ప‌డిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తొలి రౌండ్‌లోనే వైసీపీ అన్ని స్థానాల్లోనూ ఆధిక్య‌త సాధించింది. ఇక రెండు, మూడు రౌండ్లు కొన‌సాగుతున్న వేళ కూడా 10కి 10 స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంతో ఉంది. ఒక్క ఆముదాలవ‌ల‌స‌లో మాత్ర‌మే ఆధిక్యం కాస్త అటూ ఇటూ మారుతూ వ‌స్తోంది.


ఇక విజ‌య‌న‌రం జిల్లాలోని 9 స్థానాల్లోనూ వైసీపీ స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో ఉంది. బొత్స సోద‌రులు పోటీ చేసిన గ‌జ‌ప‌తిన‌గ‌రం, చీపురుప‌ల్లితో పాటు అశోక్‌కుమార్తె పోటీ చేసి అతిథి కూడా వెనుకంజ‌లోనే ఉన్నారు. మంత్రి సుజ‌య్‌కృష్ణ బొబ్బిలిలో వెన‌క‌ప‌డిపోయారు. ఇక విచిత్రంగా త‌న పార్ల‌మెంటు ప‌రిధిలో ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వెనుకంజ‌లో ఉన్నా... ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాత్రం లీడ్‌లో ఉన్నారు. ఏదేమైనా ఇప్ప‌టికే నెల్లూరు లాంటి చోట్ల స్వీప్ దిశ‌గా ముందుకు వెళుతోన్న వైసీపీ ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాతో పాటు శ్రీకాకుళంను కూడా స్వీప్ చేయ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: