ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చేందుకు కార‌ణ‌మైన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఈ సారి ఫ్యాన్ జోరు మామూలుగా లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్ల‌కు 15 సీట్ల‌ను గెలుచుకున్న టీడీపీ ఈ సారి ఒక‌టి, రెండు సీట్లు మిన‌హా మిగిలిన అన్ని సీట్ల‌లోనూ ఓడిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన ట్రెండ్స్ బ‌ట్టి చూస్తే 12 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 625 ఓట్లు మెజార్టీ సాధించారు. తణుకులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు 500 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. 


పోలవరంలో మొదటి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలరాజు 3241 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక దెందులూరులో టైగ‌ర్ అని టీడీపీ వాళ్లు చెప్పుకునే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సైతం వెనుకంజ‌లోనే ఉన్నారు. ప్ర‌భాక‌ర్‌పై వైసీపీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి ముందంజ‌లో ఉన్నారు. ఇక ఏలూరులో వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల నాని 1500 ఓట్ల ఆధిక్యంలో ఉంటే, చింత‌ల‌పూడిలో ఆ పార్టీ అభ్య‌ర్థి వీఆర్‌.ఎలీజా 5 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక సర్వర్లు పని చేయకపోవడంతో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: