దేశమంతటా సర్వత్రా ఎన్నికల లెక్కింపు మొదలైంది.దానితో దేశం లోని రాజకీయ నాయకులు మరియు ప్రజల అందరూ ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి న్యూస్ ఛానెల్స్ చూస్తూ  టీవీలకి  అతుక్కుపోయారు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు లోకసభకు మరియు అసెంబ్లీ కు ఒకేసారి కౌంటింగ్ మొదలవ్వనున్నది.

 

దానితో అసెంబ్లీ స్థానాలలో మరియు లోకసభ స్థానాలలో ఎవరు ఎక్కువ గెలుస్తారు అనే ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది.దీనికి కారణం చంద్రబాబు గారు అనే చెప్పాలి.ఆయన ఇప్పుడు యుపిఎ కు అనధికార కన్వీనర్ పాత్ర పోషిస్తూ దేశం లోని 21 పార్టీలను కాంగ్రెస్ తో కలపడానికి ప్రయత్నిస్తూన్నారు.ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అధిక స్థానాలు గెలవకుంటే కేంద్ర స్థాయిలో ఆయన మాట చెల్లు కాదు.ఇప్పటికే తాము మరోసారి గెలవబోతున్నాం అని చంద్రబాబు గారు ప్రకటించారు.

 

కాని వచ్చిన ఎక్సట్ పోల్స్ లో సగానికి పైగా వారి పార్టీ కి వ్యతిరేకంగా వచ్చాయి.అలాగే గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీ గెలుపు కష్టమని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్లు వదంతులు ఎక్కువ అయ్యాయి.ఏదిఏమైనా ఎవరు గెలుస్తారో తెలుసు కోవడానికి మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: