నిజంగా దీనిని జగన్ ప్రభంజనంగా చెప్పుకోవాలి. ఫ్యాన్ ధాటికి సైకిల్ నిలబడలేని పరిస్థితి. సుమారు 145 స్థానాల్లో ఆధిక్యత లో ఉందంటే దీనిని ల్యాండ్ స్లైడింగ్ విజయంగా చెప్పుకోవాలి.  పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది.. తొలిరౌండ్ కూడా పూర్తయింది.. వైసీపీ ఆధిక్యం స్పష్టమైంది. టీడీపీ భ్రమలు తొలుగుతున్నాయి. ఫ్యాన్ గాలి జోరు ముందు ఆ పార్టీ కుదేలైంది. చిగురుటాకులా వణుకుతోంది.


ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. ఏపీ అంతటా వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఏకంగా 100 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది. అటు టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. తాజా ఫలితాల సరళి చూస్తుంటే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పులివెందుల నియోజకవర్గం విషయానికొస్తే మొదటి రౌండ్ నుంచే జగన్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.


ఈసారి పులివెందుల ప్రజలు జగన్ కు రికార్డు మెజారిటీ కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. అటు కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం కొనసాగుతోంది. జనసేన విషయానికొస్తే, ఆ పార్టీకి చెందిన క్యాండిటేట్లు ఎవరూ ఖాతా తెరవలేదు. ఏ ఒక్కరూ కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేదు. చివరికి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా గాజువాక, భీమవరంలో వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: