న‌రేంద్ర మోదీ మ‌రోసారి త‌న ఛ‌రిష్మాను ప్ర‌ద‌ర్శించారు. రాజ‌కీయాల్లో త‌న‌ను మించిన వ్య‌క్తి ఎవ‌రూ ద‌రిదాపుల్లో లేర‌ని నిరూపించారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ఆరోప‌ణ‌లు చేసినా..విప‌క్షాల‌న్నీ ఏక‌మై దాడులు చేసినా ఒకే ఒక్క‌డై పార్టీని న‌డిపించారు. దేశం త‌న వైపు చూసుకునేలా చేశారు. అమిత్ షా అండ్ టీం ఇపుడు మ‌రింత ప‌టిష్టంగా త‌యారైంద‌నే చెప్పాలి. అతిర‌థ మ‌హార‌థులు, రాజ‌కీయ ఉద్దండులు 17వ లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. వారిలో చాలా మంది అడ్ర‌స్‌లు గ‌ల్లంత‌య్యాయి. తాజాగా ప్ర‌క‌టించిన స‌ర్వే సంస్థ‌ల ఫ‌లితాల కంటే భిన్నంగా మ‌రింత ఆధిక్యంలో మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్ డిఏ మెజార్టీ కంటే ఎక్కువ‌గా దూసుకెళుతోంది.
 
ఓ వైపు నోట్ల ర‌ద్దు , నిరుద్యోగం , ప్ర‌జల‌ను ఇబ్బంది పెట్టే నిర్ణ‌యాలు తీసుకున్నా ఏ ద‌శ‌లోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాలు మోదీని ఢీకొన‌లేక పోయాయి. కాంగ్రెస్ పార్టీకి 100 సీట్ల లోపే రానున్నాయి. అనూహ్యంగా రీజిన‌ల్ పార్టీలు త‌మ స‌త్తాను చాటాయి. 108 సీట్ల‌లో ఇత‌రులు గెలుపొంద‌డం రికార్డు. తెలంగాణ‌లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ఏపీలో జ‌గ‌న్ త‌న స‌త్తాను చాటారు. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్, మ‌ధ్య ప్ర‌దేశ్, ఢిల్లీ, పంజాబ్, హ‌ర్యానా త‌దిత‌ర రాష్ట్రాల‌లో బీజేపీ త‌న జోడు పెంచింది. రెండో రౌండ్ ముగిసే స‌రికి 342 స్థానాల్లో బీజేపీ త‌న మార్క్ కొన‌సాగిస్తోంది. ఉత్త‌ర భార‌తంలో క‌మ‌లం విక‌సించింది.

త‌మిళ‌నాడులో మాత్రం డిఎంకే త‌న ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. దేశ‌మంతటా ప్రాంతీయ పార్టీలు మ‌రోసారి స‌త్తాను చాటాయి. ఏపీలో వైసీపీ థంబింగ్ మెజారిటీ దిశ‌గా దూసుకెళుతోంది. మొద‌టి నుంచి కౌంటింగ్ వ‌ర‌కు చూస్తే అన్ని చోట్లా ఎన్ డిఏ హ‌వా కొన‌సాగిస్తుండ‌గా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమిత‌మైంది. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన బిజేపీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. 


స‌ర్వే సంస్థ‌ల అంచ‌నాలు దాటి మోదీ త‌న ప్ర‌తాపాన్ని చూపించే దిశ‌గా సాగుతున్నారు. ఇత‌రులు, ప్రాంతీయ పార్టీల‌కు సంబంధించి 109 సీట్ల‌లో రెండో రౌండ్‌లో ఆధిక్యంలో కొన‌సాగిస్తుండ‌గా ..అత్య‌ధిక లోక్‌స‌భ సీట్లు ఉన్న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో బీఎస్పీ, ఎస్పీలు క‌లిసి పోటీ చేసినా గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక పోయాయి. ఇక్క‌డ కూడా బీజేపీ త‌న ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక బెంగాల్‌లో కూడా క‌మ‌లం విక‌సించేలా చేశారు. హ‌స్తిన వీధుల్లో క‌మ‌ల‌నాథుల ఆనందానికి హ‌ద్దు లేకుండా పోయింది. సాయంత్రానిక‌ల్లా స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఏ పార్టీకి వ‌స్తుంద‌నేది తేల‌నుంది. ప్ర‌స్తుతానికి చూస్తే మోదీ నేతృత్వంలోని ఎన్ డిఏ రెండోసారి కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే దిశగా రాకెట్ కంటే వేగంగా ముందుకెళుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: