ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఆయ‌న‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురుకానుంది. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి గట్టిగానే వీస్తుందో ఇక్క‌డ చిత్తూరు జిల్లాలోనూ అదే ప‌రిస్థితి క‌న‌ప‌డుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్లు ఓట్లు మొద‌లుకుని.. ఐదారు రౌండ్లు ముగిసేస‌రికి ఫ్యాన్ స్పీడ్ మ‌రింత‌గా దూసుకుపోతోంది. ఇప్ప‌టికే నెల్లూరు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం లాంటి జిల్లాల్లో ఫ్యాన్ దూసుకుపోతోంది.

ఇక జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో స్వీప్ దిశ‌గా వెళుతోన్న వైసీపీ... చిత్తూరు జిల్లాలోనూ ముందంజలో ఉండటం గమనార్హం. చిత్తూరులో 14 సీట్ల‌లో ఒక్క కుప్పంలో మాత్ర‌మే చంద్ర‌బాబు ముందంజ‌లో ఉండ‌గా... మిగిలిన 13 సీట్ల‌లోనూ వైసీపీ అభ్య‌ర్థులే ముందంజ‌లో ఉన్నారు. ఇక క‌ర్నూలు జిల్లాలోనూ 14 సీట్ల‌కు ఒక్క సీటు మిన‌హా అన్ని సీట్ల‌లోనూ వైసీపీ లీడ్‌లో ఉంది.

ఇక చిత్తూరు జిల్లాలో కుప్పంలో మూడు రౌండ్లు ముగిసే సరికి చంద్రబాబు 1414 ఓట్ల మెజార్టీతో...- నగరి నియోజకవర్గంలో మూడు రౌండ్లు ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి రోజా 9607 ఓట్లతో ముందజలో ఉన్నారు. పూతలపట్టుతో పాటు మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి పోటీ చేసిన ప‌ల‌మ‌నేరులో కూడా వైసీపీ లీడ్‌లో ఉంది. గంగాధర నెల్లూరులో వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామి 5593 ఓట్ల మెజార్టీతో ముందజలో ఉండగా.. టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. ట్రెండ్స్ చూస్తుంటే చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ఒకే ఒక్క‌డిగా మిగిలిపోనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: