ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాజీనామా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి మంచి మెజారిటీతో దూసుకుపోతున్న నేపధ్యంలో చంద్రబాబు ఓటమిని అంగీకరించక తప్పలేదు. మొన్నటి వరకూ జూన్ 8 వతేదీ వరకూ తాను ముఖ్యమంత్రినంటూ చెప్పిన చంద్రబాబు చివరకు రాజీనామా చేయక తప్పలేదు.

 

జూన్ 8 వరకూ తానే ముఖ్యమంత్రిన అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై అన్నీ వైపుల నుండి జనాలు విరుచుకుపడ్డారు. 23వ తేదీన వైసిపి గెలిచి 24వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయాలంటే చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే అని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం చెప్పిన విషయం తెలిసిందే. ఎల్వీ ప్రకటనపై చంద్రబాబు అండ్ కో మండిపడ్డారు.

 

ఏదేమైనా చిరవకు గురువారం రాజీనామా చేయటానికి వేరే దారిలేకే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే జగన్ ప్రమాణస్వీకారం చేసేంత వరకూ చంద్రబాబును కేర్ టేకర్ సిఎంగా ఉండమని గవర్నర్ కోరే అవకాశం ఉంది. 26వ తేదీన వైఎస్సార్సిపి సామవేశం అవనున్నది. 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: