కృష్ణా జిల్లాలో వైసీపీ దూసుకుపోతోంది. టీడీపీ గ‌త ప‌దిహేనేళ్లుగా ఇక్క‌డ టీడీపీ హ‌వానే న‌డుస్తోంది. 2009, 2014 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ స‌త్తా చాటుతోంది. అయితే తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లైంది. జిల్లాలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. టీడీపీ నాలుగైదు అసెంబ్లీ సీట్లు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ అభ్య‌ర్థులు భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు. కొడాలి నాని 2600 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ నాని ముందు నుంచే చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ వ‌స్తున్నారు. 


ఇక నానిని ఓడించేందుకు చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దేవినేని వార‌సుడు దేవినేని అవినాష్‌ను రంగంలోకి దించారు. అవినాష్‌తో నానిని చిత్తు చిత్తుగా ఓడిస్తామ‌ని టీడీపీ వాళ్లు శ‌ప‌థాలు చేశారు. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతోన్న వేళ చంద్ర‌బాబు మంత్రాంగం ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఫ‌లించ‌లేద‌ని తెలిసిపోయింది. నాని స్ప‌ష్ట‌మైన మెజార్టీతో దూసుకుపోతున్నారు. నాని గెలిస్తే అటు జ‌గ‌న్ కేబినెట్‌లో కేబినెట్ బెర్త్ ఖాయంగా ద‌క్కించుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: