అంతన్నాడు..ఇంతన్నాడు - ఎత్తి కుదేస్తే రెండయ్యాడన్నట్టుంది..తెదేపా అధినేత చంద్రబాబు పరిస్థితి.   పార్టీ పుట్టి సంవత్సరం కూడా కాకుండానే వందల సీట్ల ప్రజాభిమానం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి గెలిచినా..ఓడినా తెదేపా తన గౌరవాన్ని, ప్రజల అభిమానాన్ని కోల్పోలేదు.


మొట్టమొదటి సారిగా బాబోరి అధినాయకత్వంలో, అటు జనసేన, ఇటు కె.ఎ.పాల్ ఇంకా ఎన్నో వ్యూహాలకు -కుతంత్రాలకు మద్యలో ఉండేటటువంటి విషయాలను అమలుపరచినా తెదేపా ఓడిపోయిందనుకోవడం కంటే..బాబోరి అధినాయకత్వంలో తెదేపాని ఆంధ్రప్రజ ఛీ కొట్టారును కోవడం కరెక్టేమో?


ఓడిపోవడం-గెలవడం సహజం, కానీ దారుణాతి - దారుణంగా ఛీత్కరించబడటం అంటే..అదే నలభై ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రాంతీయ పార్టీని.. ప్రాంతీయ ప్రజలు ఛీ కొట్టారంటే...అస్సలు ఈ విషయం రాయాలంటేనే పొత్తి కడుపులోని ప్రేగులు, మడతపడుతున్నాయంటే ప్రజలకు ఆ పార్టీ ఎంత ఘోరమయిన ఇబ్బందులకును కలుగజేసిందో కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


2019 ఎన్నికల ఫలితాల వివరములను క్షణ-క్షణానికి మీకు అందింస్తుంది మీ ఇండియాహెరాల్డ్


ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 152, తేదేపా : 21, జనసేన : 1, ఎన్డీయే : 345, యూపీఏ :91


మరింత సమాచారం తెలుసుకోండి: