Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

ప్రభుత్వం పై ప్రజల గెలుపు...

ప్రభుత్వం పై ప్రజల గెలుపు...
ప్రభుత్వం పై ప్రజల గెలుపు...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నలభై ఏండ్ల సుధీర్ఠ అనుభవం 45 ఏండ్ల యవనాయకుడి ముందు తల వంచింది. వైఎస్సార్‌ సీపీ నాయుకులు కూడా ఊహించన విజయ విహారం ఇది. గత ఐదేళ్లుగా జనంలోనే తిరుగుతూ, జనం గోడు వింటూ జననాయుకుడిగా ఎదిగాడు.

 విజయనగరం,విశాఖ పట్నంలో జగన్‌ పాద యాత్రలో ఎండల్ని సైతం లెక్క చేయకుండా , ప్రజా వెల్లువను ప్రత్యక్షంగా చూసిన ఈ జర్నలిస్టు ఒక ఆటో డ్రైవర్‌ని అడిగినపుడు ' ఈ సారి వార్‌ వన్‌ సైడే...జగన్‌ సీఎం అవుతారు ...' అన్నాడు. అదే ఇపుడు నిజం అయింది.

 క్షేత్ర స్ధాయిలో మేం గుర్తించిన ప్రభుత్వ వ్యతిరేకత 

1, టీడీపీ,జనసేన పార్టీ నాయకులు 'ఆంధ్రా వాళ్లను తెలంగాణా లో కొడుతున్నారు ...'' అని, ప్రచారం చేయడం వల్ల, రాజకీయ స్వార్దం కోసం ఆ రెండు పార్టీలు రెండు తెలుగు రాస్ట్రాల మధ్య విధ్వేషాలు పెంచుతున్నారనే భావన విద్యావంతుల్లో తీవ్రంగా ఉంది.

 2, రాష్ట్రంలో విద్యుత్‌ లేని కుగ్రామాల సంఖ్య రెండు వందలకు పైగా ఉన్నట్టు మా పరిశీలనలో తెలిసింది. ' కరెంట్‌ బల్బ్‌ ఎలా ఉంటుందో మాకు ఇప్పటి వరకు తెలీదు. సెల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌కి రెండు కిలోమీటర్లు పోవాలి. మా గ్రామం మీద తరుచూ ఏనుగులు దాడి చేస్తుంటాయి, అయినా అధికారులు మా వైపు చూడరు.'' అని చిత్తూరు జిల్లా,మాధవరం కుయ్యవంక గ్రామస్తులు మాతో చెప్పారు.

 3,జన్మభూమి కమిటీల ఆరాచకం . ప్రతీ సంక్షేమ పథకం అమలులో వారి దుర్మార్గాలను ప్రజలు తట్టుకోలేక పోయారు. ప్రజల్లో అపంతృప్తిని పెంచాయి. 

4,రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఫల్యం 5, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. నైపుణ్యం ఉన్నవారికి కూడా ఉపాధి అవకాశాలు దొరకడం లేదని నెల్లూరు జిల్లా, తడ సమీపంలోని ఒక ఐటీఐ చదివిన నిరుద్యోగి మాతో అన్నారు. ''రాని ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బతుకు తెరువు కోసం మట్టిపనులు చేసుకొని బతుకుతున్నాం..'' అని అరకు సమీపంలోని పెద్దలబుడు యువకుడు మాతో అన్నాడు. 

ఇలా అనేక అంశాలను పరిశీలిస్తే, ఇది జగన్‌ గెలుపా? చంద్రబాబు ఓటమా?అంటే, ఇది ఖచ్చితంగా ప్రజల గెలుపు మాత్రమే...

ఈ సారి జగన్‌కి ఒక ఛాన్స్‌ ఇద్దాం అనే భావనను టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు కల్పించాయి. పోలింగ్‌ అనంతరం జగన్‌ అన్నట్టు ఇది ఖచ్చితంగా ల్యాండ్‌ సైడ్‌ విక్టరీ.

ap-election-results
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగు దర్శకుడి అక్రమ నిర్మాణం కూల్చివేత !!
  '' మల్లేశం''  ఎందుకు చూడాలి ?
 '' జగన్‌ మంచిగ చేస్తుండు !!''- గోరేటి ఎంకన్న
ఆయన రాత్రి ఉదయిస్తున్న రవి...
ఆ పత్రిక ఎడిటర్‌ ఔట్‌ ...?
జగన్ కి కేశినేని నాని సలహా ?
హీరో రామ్‌కి చుక్కలు చూపించిన పోలీసులు..?
'' ప్రజలెవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు ...? ''
అనిల్‌ కుమార్‌ !! మీరు సూపర్‌ !!
హై టెక్ సిటీలో ఉద్యోగం కావాలా ?
హీరొ రవితేజ ఇక్కడే ఎందుకు భోజనం చేస్తాడో తెలుసా...?
'' వైఎస్‌ జగన్‌ అనే అతడు...'' అని, ఆ పత్రికలో ఎందుకు రాశారంటే..?
జగన్‌ ఫొటో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఎందుకు వేశారో తెలుసా?
వంద కోట్ల పరువు నష్టం దావా...?
గ్రామ స్వరాజ్యం కోసం,చినజీయర్ స్వామి ?
హైదరాబాద్‌లో రూపాయికి ఎకరం !!
 ఈ డ్యామ్‌ లేకపోతే, అమెరికాలో పంటలు పండవు... !!
ఆ జర్నలిస్టుల వల్ల ఏపీకి, అరకోటి నష్టం!!
డాక్ట‌ర్ల‌కు 'ల‌య‌న్స్ క్ల‌బ్ ' సంఘీభావం
గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 హెచ్‌ఐవీ రోగులకు ఉచితంగా మందులు!!
 పేద విద్యార్థులకు ఉచిత వసతి, నైపుణ్యశిక్షణ!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.