దేశంలో చ‌క్రం తిప్పేందుకు స‌మ‌యం సిద్ధ‌మైంద‌నే ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఒక‌రు కాదు...ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను ఓడించిన ప్ర‌త్యేక‌త‌ను ఆయ‌న మూట‌గ‌ట్టుకుంటున్నార‌నే అంటున్నారు. త‌న సొంత కొడుకుతో పాటుగా...మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఓట‌మిలో దోహ‌ద‌ప‌డిన అప‌ప్ర‌ద‌ను చంద్ర‌బాబు సొంతం చేసుకున్నారు.


ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తనయుడిగా ఎమ్మెల్సీ అయిపోయి, మంత్రి అయిన లోకేష్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గడం అనే విషయంలో లోకేష్ సత్తా చూపిస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారగా....ఆయ‌న ఓట‌మి వైపు సాగుతున్నారు.ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 134  స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓట‌మి ప‌రంప‌ర‌లో లోకేష్ ఉండ‌టం గ‌మ‌నార్హం. 


మ‌రోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మాండ్యాలో జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థి, కుమారస్వామి కుమారుడు నిఖిల్ సైతం ఓట‌మి దిశ‌గా సాగుతున్నారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నటి సుమలత ముందంజ‌లో ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లో నిఖిల్‌ మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. త‌న సొంత కుమారుడిని గెలిపించుకోలేక‌పోతున్న చంద్ర‌బాబు..అటు త‌ను ప్ర‌చారం చేసిన ముఖ్య‌మంత్రి త‌న‌యుడిని సైతం గెలిపించ‌లేర‌నే భావ‌న‌ను సైతం చంద్ర‌బాబు మూట‌గ‌ట్టుకుంటార‌ని అంటున్నారు. మ‌రోవైపు, చంద్ర‌బాబు ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌చారం చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ముల‌పై సైతం ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: