ఏపీలో బాబుకు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఏకంగా 15 మంది వ‌ర‌కు మంత్రులు ఓట‌మి బాట‌లో ఉన్నారు. మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఓట‌మి బాట‌లో ఉంటే... ఇటు విశాఖ ఎంపీగా పోటీ చేసిన బాల‌య్య చిన్న అల్లుడు భ‌ర‌త్ కూడా ఓట‌మి బాట‌లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ టీడీపీ మంత్రికంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోల‌య్యాయంటే ఇది ఎంత ఘోర‌మైన ఓట‌మో తెలుస్తోంది. ఆ మంత్రి ఎవ‌రో కాదు.. అర‌కు నుంచి పోటీ చేసిన కిడారి శ్ర‌వ‌ణ్ కుమార్‌.


విశాఖపట్నంలోని అరకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్ కుమార్‌ కంటే నోటాకే అత్యధిక ఓట్లు పోలయ్యాయి. అరకులో ఈసారి సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గెలిచిన కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు ఆ త‌ర్వాత వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలోకి జంప్ చేసిన సంగ‌తి తెలిసిందే.


ఈ ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందు చంద్ర‌బాబు శ్ర‌వ‌ణ్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అరకు నుంచి వైసీపీ తరఫున చెట్టి ఫల్గుణ పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో శ్ర‌వ‌ణ్‌కు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం ఓ మైన‌స్ అయితే... నోటా కంటే త‌క్కువ ఓట్లు రావ‌డం మ‌రీ ఘోరం. సుమారు ఆరు నెలలపాటు శ్రవణ్ మంత్రిగా పనిచేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: