ఫ్యాన్ గాలికి తెలుగుదేశంపార్టీ కోటలన్నీ బద్దలైపోయాయి.  ఈ జిల్లా అని లేదు ఆ జిల్లా అని లేదు. వైపిపి దెబ్బకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఫ్యాన్ గాలి చిత్తూరు జిల్లా వరకూ ఈడ్చి కొట్టింది. ఫ్యాన్ గాలే చివరకు సునామీ లాగ ఓ ఊపు ఊపేసింది టిడిపిని. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసిపి ఏకంగా 152 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉందంటేనే అర్ధమవుతోంది వైసిపి గాలి ఏ స్ధాయిలో ఉందో.

 

చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో టిడిపి కేవలం ఒకచోట గెలిచి మరో చోట ఆధిక్యంలో ఉంది. గెలిచిన ఓక్కసీటు కూడా కుప్పంలో చంద్రబాబునాయుడే కావటం గమనార్హం. ఇక నెల్లూరులో చూస్తే పదికి పది సీట్లు వైసిపిదే ఆధిక్యం. కడపలో కూడా పది సీట్లూ వైసిపినే గెలుస్తోంది. కర్నూలులో 14 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల మంచి ఆధిక్యతలో కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలోని 14 స్ధానాల్లో ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగితాదంతా వైసిపి ఖాతాలోనే పడుతోంది.

 

ఇక రాజధాని జిల్లాలైన  కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ఈసారి టిడిపిని ఆదుకోలేదు. కృష్ణా జిల్లాలోని 16 సీట్లకు గాను టిడిపి కేవలం రెండు చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక గుంటూరు జిల్లాలోని 17 సీట్లకు గాను 14 చోట్ల ఆధిక్యంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 12 చోట్ల ఆధిక్యంతో ఉంది. ఈ జిల్లాలో పోయిన ఎన్నికల్లో వైసిపికి ఒక్క సీటు కూడా రాలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో వైసిపి ఏకంగా 15 చోట్ల లీడ్ లో ఉంది.

 

ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 9 చోట్ల ఫ్యాన్ గాలిదే ఆధిక్యం. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని 10 సీట్లలో 9 చోట్ల  వైసిపిదే ఆధిక్యం. విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గల్లో మొత్తం అంతా ఫ్యాన్ మయమే. విశాఖపట్నం జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల ఆధిక్యం ఫ్యాన్ దే.

 

విచిత్రమేమిటంటే ఐదేళ్ళ అత్యంత అవినీతితో అసమర్ధతతో కేవలం ప్రచారంతో మాత్రమే పాలన సాగించిన చంద్రబాబుకు జనాలు మాడు పగలగొట్టారు. పైగా ఎవరితో  పొత్తు లేకుండా చంద్రబాబు పోటీ చేయటం ఇదే మొదటిసారి. మొదటిసారే జనాలు టిడిపి మాడు పగలగొట్టి వదిలిపెట్టారు. దశాబ్దాల తరబడి టిడిపిని కాపాడిన జిల్లాలకు జిల్లాలే బద్దలైపోయాయంటే ఏ స్ధాయిలో చంద్రబాబుపై వ్యతరేకతుందో అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: