ఎన్నికల ఫలితాలు రానే వచ్చేసాయి. ఐదు సంవత్సరాల ఉత్కంఠ కు తెరపడింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లో మొదటి రౌండ్ నుంచే వైసీపీ హవా కొనసాగింది. ఇక్కడి వైసీపీ అభ్యర్థి రాచమల్లు తన ఆధిక్యతను కొనసాగించి విజయాన్ని అందుకున్నారు. రాచమల్లు కు పోటీ గా నిల్చున్న లింగారెడ్డి అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

దాదాపు గా కడప జిల్లా మొత్తం వైసీపీ హవా కొనసాగుతుంది. జగన్ మేనియా కడప జిల్లాలో బాగా కలిసొచ్చింది. ఎప్పుడు లేని అత్యధిక మెజారిటీతో వైసీపీ దూసుకెళ్తుంది. ప్రొద్దుటూరు లో పోటీ హోరాహోరీ జరుగుతుంది అని అనుకున్నారు.కానీ రాచమల్లు ఏకపక్షంగా ,గెలుపు తన వైపే ఉందని తొలి రౌండ్ నుంచే పై చేయి కొనసాగించారు.

టీడీపీ పార్టీ పల్లె ప్రాంతాల్లో ఉన్న ఆదరణ వల్ల గెలుపు ఖాయం అని భావించారు . అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ వైసీపీ దూసుకెళ్లింది. ఎంతలా అంటె కనీసం యే ఒక్క దశలో కూడా లింగారెడ్డి కనీస పోటీ ఇవ్వలేనంతగా. ఇక్కడ ముందు నుండి వరదరాజుల రెడ్డి పేరు తెదేపా వర్గాల నుండి పరిగణలో ఉన్నా కూడా చివరి నిమిషాల్లో లింగా రెడ్డికి టికెట్టు ఇచ్చి ఆశ్చర్యపరిచిన తెదేపా అధిష్తానం చివరికి తలపట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: