చూస్తే విషయం అలాగే అనిపిస్తోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో చంద్రబాబునాయుడుకు జనాలు మాడు పగలగొట్టారు. ఇటు ఎంఎల్ఏ నియోజకవర్గాలతో పాటు ఎంపి స్ధానాల్లో కూడా జనాలు కొర్రు కాల్చి బాగా వాతపెట్టారు. దాంతో ఒక్క ఎంపి సీటును కూడా టిడిపి గెలిచే అవకాశం కనిపించటం లేదు. అలాగే అసెంబ్లీలో కూడా 175కి మహా అయితే ఓ 25 సీట్లలో గెలిస్తే అదే గొప్పన్నట్లుగా ఉంది పరిస్దితి.

 

తాజా ఫలితాలతో ఇటు చంద్రబాబుకే కాకుండా అటు యూపిఏ పక్షాలకు కూడా జనాలు పెద్ద షాకే ఇచ్చారు. యూపిఏ మొత్తం మీద 80 స్ధానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఇందులో కాంగ్రెస్ షేర్ మహా అయితే ఓ 30 సీట్లుంటాయి. అంటే పోయిన ఎన్నికల్లో  గెలిచిన సీట్లు కూడా ఇపుడు రావటం లేదని తేలిపోయింది. దాంతో చంద్రబాబుతో పాటు యూపిఏ కు కూడా జనాలు తిరస్కరించినట్లు అర్ధమైపోయింది.

 

తాజాగా వెల్లడైన ఫలితాలతో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబుకు సైడైపోవటం ఖాయమనే తోస్తోంది. ఎందుకంటే, అధికారంలో ఉండి 18 ఎంపి సీట్లున్నపుడే చంద్రబాబుకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాంటిది అధికారం కోల్పోవటమే కాకుండా ఒక్క ఎంపి సీటు కూడా గెలుచుకోకపోతే చంద్రబాబును ఎవరు పట్టించుకుంటారు. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడైన దగ్గర నుండి చంద్రబాబును పట్టించుకోవటం మానేశారు. అలాంటిది రేపటి నుండి జాతీయ పార్టీల నేతలెవరూ చంద్రబాబును దగ్గరకు కూడా రానీచ్చేట్లు లేరు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: