దేశంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న బీజేపీ అందులో విజయం సాధించింది. సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణాల్లో సీట్లను గణనీయంగా పెంచుకున్న భాజపా , ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ లో కూడా తన పట్టును నిలుపుకుంది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆ స్థానం నుంచి గెలుపొందారు.  


అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన తపిర్ గావో కూడా ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం కౌంటింగ్ కాంగ్రెస్ కాస్త పోటీనిచ్చినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు బీజేపీ వశమయ్యాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: