రాజకీయాల్లో సమూల మైన మార్పుకోసం, అన్యాయాలను ప్రశ్నించడమే లక్ష్యంగా సంచలన స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండీ ఎపీ రాజకీయాల్లో త్రిముఖ పోటీ మొదలైంది. జనసేన పార్టీ గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ , ఆ పార్టీలో అవినీతి పెరిగిపోయిందని విమర్శలకు దిగిన పవర్‌స్టార్‌ ఈ సారి ఒంటరి గానే టీడీపీని, వైసీపీని ఎన్నికల్లో ఎదుర్కొన్నారు. 

అయితే రాజకీయాలను సీరియస్‌గా తీసుకోక పోవడం పార్టీ నిర్మాణం పట్ల శ్రద్ధ పెట్టక పోవడం, బూత్‌ లెవల్‌ కమిటీలను నియమించక పోవడం వంటి సంస్దాగత లోపాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. 

చివరికి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బరిలోకి దిగిన రెండు స్థానాల్లోనూ వెనక బడ్డారు.
 గాజువాకలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,500పై చిలుకు ఓట్ల వెనుకంజలో పవన్‌ ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో 13 రౌండ్లు ముగిసేసరికి పవన్‌.. 2 వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకబడిపోయారు. 

రాజోలులో ఆధిక్యం... 

తూర్పుగోదావరి జిల్లా రాజోల్‌ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం ఒకే ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: